Nagachaitanya’s Love Story Movie postpones again

Sunday,August 29,2021 - 12:34 by Z_CLU

నాగచైతన్య , సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లవ్ స్టోరి' సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడింది. సెకండ్ ఎఫెక్ట్ కారణంగా ఒకసారి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న మేకర్స్ ఇప్పుడు ప్రేక్షకులు ఇంకా థియేటర్స్ కి రాని కారణంగా వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం విడుదలైన సినిమాలకు కలెక్షన్స్ తక్కువ వస్తున్న కారణంగా వచ్చే నెల వినాయక చవితి కి రావాల్సిన ఈ సినిమాను రెండు వారాలు పోస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

సెప్టెంబర్ 27 న లేదా అక్టోబర్ మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేసే సన్నాహల్లో ఉన్నారు. ఇప్పుడు లవ్ స్టోరి రిలీజ్  డేట్ పై గోపిచంద్ కాన్నేశాడు. సెప్టెంబర్ 3న రావాల్సిన ఈ సినిమా లవ్ స్టోరి రావలసిన డేట్ కి రిలీజ్ అవ్వనుంది. మేకర్స్ తాజాగా ఈ డేట్ ఎనౌన్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో అన్ అఫీషియల్ గా లవ్ స్టోరి ఆరోజు రావడం లేదని క్లారిటీ వచ్చేసింది. త్వరలోనే మేకర్స్ పోస్ట్ పోన్ అయిన విషయాన్ని తెలియజేసి మరో కొత్త డేట్ ప్రకటించనున్నారు.

నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న లవ్ స్టోరి పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారనే నమ్మకం ఇటు నిర్మాతలతో పాటు అటు డిస్ట్రిబ్యూటర్స్ , ఎగ్జిబ్యూటర్స్ కి కూడా ఉంది. మరి ఆ నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పుతున్నాయి. ముఖ్యంగా సారంగ దరియా సాంగ్ భారీ స్థాయిలో రికార్డు వ్యూస్ అందుకొని టాప్ ప్లేస్ లో ఉంది.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics