అక్కినేని యంగ్ హీరోల నుండి సినిమాలు వచ్చి చాలా రోజులవుతుంది. ప్రస్తుతం నాగచైతన్య 'లవ్ స్టోరి' , అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలు చేస్తున్నారు. కరోన ఎఫెక్ట్ తో షూటింగ్స్ ఆలస్యం అవ్వడంతో రిలీజ్ వరకూ వచ్చి వాయిదా పడిన ఈ సినిమాలు ఇప్పుడు ఎట్టకేలకు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. అదీ రెండు వారాల గ్యాప్ లో వస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అవును చైతు 'లవ్ స్టోరి' సెప్టెంబర్ 24 న రిలీజ్ అవుతుంది. ఇక అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదలవుతుంది. నిజానికి అఖిల్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి చాలా రోజులైంది. లవ్ స్టోరి మాత్రం ముందు వినాయక చవితికి అనుకున్నారు. ప్రకటన కూడా ఇచ్చారు. కానీ మళ్ళీ వాయిదా వేసుకొని నెలాఖరున రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
అలా అనుకోకుండా లవ్ స్టోరి వాయిదా పడి నెలాఖరున రావడంతో అక్కినేని అన్నదమ్ముల సినిమాలకి కేవలం రెండు వారాల గ్యాప్ మాత్రమే ఉంది. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం వరుసగా తమ అభిమాన హీరోల నుండి నెలకో సినిమా రిలీజ్ అవుతుండటంతో సంతోష పడుతున్నారు. అయితే ఈ రెండు లవ్ స్టోరీస్ పై మంచి అంచనాలున్నాయి. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల నుండి వస్తున్న సినిమా కావడంతో లవ్ స్టోరి గురించి అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక చాలా గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న కావడంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ నెలకొంటున్నాయి. మరి ఈ లవ్ స్టోరీస్ తో అక్కినేని హీరోలు ఎలాంటి విజయాలు అందుకుంటారో థియేటర్స్ లో ఎంత వసూళ్ళు రాబడతారో వేచి చూడాలి.
- Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics