NagaChaitanya about his upcoming projects

Thursday,September 16,2021 - 03:16 by Z_CLU

ఈ నెల 24న 'లవ్ స్టోరి' సినిమాతో థియేటర్స్ ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్య సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టేశాడు. కొన్ని మీడియాలకు పెర్సనల్ గా ఇంటర్వ్యూ ఇచ్చాడు. లవ్ స్టోరి తో పాటు మిగతా ప్రాజెక్ట్స్ గురించి కూడా వారితో షేర్ చేసుకున్నాడు. ఇక చైతు -పరశురాం కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా కూడా త్వరలోనే ఉంటుందని తెలిపాడు చైతు. మహేష్ తో పరశురాం చేస్తున్న 'సర్కారు వారి పాట' తర్వాత తమ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని క్లారిటీ ఇచ్చాడు.

అలాగే విక్రమ కె కుమార్ తో వెబ్ సిరీస్ చేస్తున్నాని కన్ఫర్మ్ చేశాడు. ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో 'థాంక్యూ' సినిమా చేస్తున్నాను. అది షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఓ సంస్థకి మేమిద్దరం కలిసి సిరీస్ చేయబోతున్నాం.... దానితో OTTలో డెబ్యూ ఇవ్వబోతునానంటూ చెప్పుకున్నాడు. ఇక బంగార్రాజు సినిమా విశేషాలు కూడా పంచుకున్నాడు చైతు. సినిమాలో తనని కంప్లీట్ మాస్ అవతార్ తో పంచెకట్టుతో చూస్తారని చెప్పాడు.

ఇక లవ్ స్టోరి ఒప్పుకోవడానికి శేఖర్ కమ్ముల ఒక రీజన్ అయితే కథలో ఉన్న కొన్ని లేయర్స్ బాగా నచ్చాయని అవి మరో రీజన్ అని తెలిపాడు. సినిమా కేవలం లవ్ స్టోరి మీదే రన్ అవ్వదని చాలా లేయర్స్ ఉంటాయని అవి అందరినీ ఆకట్టుకుంటాయని కాన్ఫిడెంట్ గా చెప్పాడు చై.

ఇక సోషల్ మీడియాలో పెద్దగా ఆక్టివ్ గా ఉండనని, కేవలం సినిమా అప్డేట్స్ కోసమే ఆ ఫ్లాట్ ఫామ్ ని వాడుతుంటానని ఇంటర్వ్యూ చెప్పుకున్నాడు చైతు. అందులో తనపై వచ్చే వార్తలు అస్సలు పట్టించుకోనని అన్నాడు. ఇలా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి కొన్ని విషయాలు చెప్తూ మీడియాతో ఆన్లైన్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యాడు చైతు. ఇక తన పర్సనల్ విషయం గురించి ఎవరూ అడగొద్దని ముందే తన టీం ద్వారా క్లియర్ కట్ గా చెప్పించాడట చై.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics