Naga Shaurya Interview abour Krishna Vrinda Vihari

Thursday,September 22,2022 - 04:07 by Z_CLU

యంగ్ హీరో నాగ శౌర్య 'కృష్ణ వ్రింద విహారి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరికొన్ని గంటల్లో ఈ సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిన శౌర్య తాజాగా తన సినిమా గురించి మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు శౌర్య మాటల్లోనే ...

డైలాగ్ వర్షన్ తో

2020 కోవిడ్ స్టార్ట్ అవ్వకముందు ఈ కథ విన్నాను. డైలాగ్ వర్షన్ తో అనీష్ కథ చెప్పారు. వినగానే నచ్చేసింది చేస్తున్నా అని చెప్పాను. ఒక రోజు అమ్మ ఏమైనా కథలు విన్నావా అని అడిగింది. ఇవ్వాళే ఓ స్క్రిప్ట్ విన్నాను బాగుంది అని చెప్పగానే సరే మేము కూడా వింటాం అన్నారు. మా డైరెక్టర్ ని కలిశారు కథ నచ్చింది. వెంటనే మన బేనర్ లో చేద్దాం అని చెప్పింది. ఈ సినిమా సొంత బేనర్ లో చేయడం అమ్మ -నాన్న నిర్ణయమే. ఈ సినిమాతో నిర్మాతగా మా అమ్మ మరో సూపర్ హిట్ అందుకుంటుందనే నమ్మకం ఉంది.

అవసరాల గారే ఆదర్శం

ఇందులో బ్రాహ్మిన్ పాత్ర కోసం నేను పెద్దగా హోం వర్క్ చేయలేదు. డైరెక్టర్ చెప్పింది చేశాను. కాకపోతే అవసరాల శ్రీనివాస్ గారితో మూడు సినిమాలు చేశాను. ఆయన బ్రాహ్మిణ్. మా మధ్య మంచి స్నేహం ఉండటం వల్ల ఈ కేరెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి , ఎలా మాట్లాడాలి అనేది ఆయన్ను కొంతవరకూ ఆదర్శంగా తీసుకున్నాను.

సెకండాఫ్ హిలేరియస్ కామెడీ ..

మా డైరెక్టర్ అనీష్ సినిమాను చాలా ఎంటర్టైనింగ్ గా తీశాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే కామెడీ ఆడియన్స్ ను హిలేరియస్ గా నవ్విస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. సినిమా చూసి ఆడియన్స్ వాళ్ళ ఫ్యామిలీ ని రిలేట్ చేసుకుంటారు. ఆయన చెప్పిన విధానం అలాగే తీసిన విధానం నాకు బాగా నచ్చింది.

వీటితో పాటు అవి కూడా

రాధిక గారు సినిమాలో కీ రోల్ చేశారు. ఆవిడ కథలో చాలా ఇంపార్టెంట్ కేరెక్టర్ లో కనిపిస్తారు. ఆవిడ పాత్ర గురించి ట్రైలర్ లో ఎక్కువ చెప్పలేదు కొంచెం చెప్పినా కథ రివీల్ అయ్యే పాత్ర అది. అందుకే ఆ కేరెక్టర్ ని ఎక్కువ ప్రమోట్ చేయలేదు. రాధిక గారు లేకపోతే ఈ సినిమా చేసే వాడిని కాదేమో. ఆవిడ లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ పాత్ర కి ఆవిడే పర్ఫెక్ట్ రేపు సినిమా చూశాక అందరూ అదే ఫీలవుతారు. ఆవిడ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. సక్సెస్ మీట్ కి వస్తారని ఆశిస్తున్నాను.

షెర్లి సెటి ..హిందీ నుండి

షెర్లి సెటి నటించిన హిందీ సినిమా చూశాం. అందులో ఆమె నటన బాగుందని అనిపించి డైరెక్టర్ అనిష్ కృష్ణ చెప్పాము. తనకి కూడా ఆమె యాక్టింగ్ నచ్చడంతో వెంటనే ఓకె చేసేశారు. సినిమాలో తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.

పాద యాత్రలో చాలా నేర్చుకున్నా

పాద యాత్ర చేయడం వల్ల సినిమాను జనాల్లోకి తీసుకెళ్లగలిగాను. హెల్త్ పరంగా కాస్త ఇబ్బంది పడినప్పటికీ ప్రేక్షకులు చూపించే ప్రేమ ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆ యాత్ర తో చాలా నేర్చుకున్నాను తెలుసుకున్నాను. నిజంగా హీరోగా ఉండటం వారి నుండి అంత ప్రేమ పొందటం ఎంతో అదృష్టం అనిపించింది.