Naga Chaitanya shares a pic from Laal Singh Chaddha sets

Friday,July 09,2021 - 08:09 by Z_CLU

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమిర్‌ఖాన్‌ నటిస్తున్న హిందీ చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’తో టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగచైతన్య బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ విషయాన్ని తన సోషల్‌మీడియా అకౌంట్‌ ద్వారా శుక్రవారం అధికారికంగా ప్రకటిస్తూ లోకేషన్‌ ఫోటోను షేర్‌ చేశారు నాగచైతన్య.

ఈ ఫోటోలో అమిర్‌ ఖాన్, కిరణ్‌రావు, ఈ చిత్ర దర్శకుడు అద్వైత్‌ చందన్‌ కలసిఉన్నారు. అమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్, వయాకామ్‌ 18 సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆస్కార్‌ అవార్డు విన్నింగ్‌ ఫిల్మ్, హాలీవుడ్‌ కల్ట్‌ క్లాసిక్‌ ‘ఫారెస్ట్‌గంప్‌’ చిత్రానికి హిందీ రీమేక్‌గా ‘లాల్‌సింగ్‌ చద్దా’ తెరకెక్కుతుంది.

naga chaitanya amir khan 1 ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ లడక్‌లో జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రయూనిట్‌ త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.

నాగచైతన్యకు ఇదే తొలి హిందీ సినిమా. అందుకే టాలీవుడ్ మొత్తం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇందులో నాగచైతన్య పాత్ర పేరు బాల. అమీర్ ఖాన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నాగచైతన్య కనిపిస్తాడు.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics