Naga Chaiatanya to do ‘Maanadu’ remake ?

Tuesday,February 15,2022 - 07:00 by Z_CLU

ప్రస్తుతం రీమేక్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల నుండి యంగ్ హీరోల వరకూ అందరూ రీమేక్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు చాలా రీమేక్స్ సెట్స్ మీద ఉన్నాయి. త్వరలోనే తెలుగులో మరో తమిళ్ రీమేక్ కూడా రానుంది. ఆ సినిమానే 'మానాడు'.

శింబు హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కించిన 'మానాడు' సినిమాకు సంబంధించి సురేష్ బాబు  తెలుగు రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం తెలుగు స్క్రిప్టింగ్ జరుగుతుంది. డైలాగ్ వర్షన్ రెడీ చేస్తున్నారు టీం. ఈ సినిమాను తెలుగులో కూడా వెంకట్ ప్రభునే హ్యాండిల్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది.

Also Read : Radheshyam Movie Stills

అయితే ఇందులో హీరో ఎవరనేది ? మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకూ ఈ సినిమాను నాగ చైతన్యతో తీసే ఆలోచనలో ఉన్నారట సురేష్ బాబు. ఇటివలే చైతూకి సినిమా చూపించి డిస్కషన్ జరిపినట్టు తెలుస్తుంది. మొన్నటి వరకూ ఈ సినిమాను రానాచేస్తాడనే న్యూస్ చక్కర్లు కొట్టింది. కానీ ఇప్పుడు చైతూ పేరు గట్టిగా వినబడుతుంది. సాఫ్ట్ క్యారెక్టర్ కనుక చైతూకి యాప్ట్ అని భావిస్తున్నారేమో సురేష్ బాబు. త్వరలోనే ఈ విషయంపై పూర్తి క్లారిటీ రానుంది. వచ్చే నెలలో లేదా ఏప్రిల్ నుండి ఈ రీమేక్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics