Nabha Natesh in Mahesh Trivikram Movie?

Monday,September 06,2021 - 08:05 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న #SSMB28 కి సంబంధించి ఓ అప్డేట్ చక్కర్లు కొడుతుంది. సినిమాలో మహేష్ తో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్నది ఆ న్యూస్. సినిమాలో మహేష్ కి హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే ఆ విషయాన్ని మేకర్స్ ఓ వీడియో ద్వారా ఎనౌన్స్ చేశారు. అయితే నభా ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించనుందని తెలుస్తుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ గత కొన్నేళ్లుగా తన సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ని తీసుకుంటూ వస్తున్నారు. నిజానికి త్రివిక్రమ్ కి ఇదొక సెంటిమెంట్. అందుకే మహేష్ సినిమాకు కూడా అదే రిపీట్ చేస్తున్నాడు. సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నభా ని ఫైనల్ చేసుకున్నారని తెలుస్తుంది. తాజాగా ఈ రోల్ కి కొందరు హీరోయిన్స్ ని అనుకొని ఇస్మార్ట్ శంకర్ తో యూత్ లో మంచి క్రేజ్ అందుకున్న నభా ని తీసుకున్నారని సమాచారం.

nabha natesh

నభా తాజాగా నితిన్ 'మాస్ట్రో' సినిమాలో నటించింది. ఆ తర్వాత ఆమె సైన్ చేసిన ప్రాజెక్ట్ ఇదేనని టాక్. ప్రస్తుతం Mahesh28 కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మహేష్ 'సర్కారు వారి పాట' పూర్తి చేసి ఫ్రీ అవ్వడమే ఆలస్యం ఈ సినిమా మొదలవుతుంది. 'అతడు','ఖలేజా' సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. హారికా హాసినీ క్రియేషన్స్ బేనర్ పై రాదా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజర్.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics