Movie theatre own over OTT

Monday,December 28,2020 - 01:37 by Z_CLU

లాక్ డౌన్ లో OTT కి డిమాండ్ పెరిగింది. థియేటర్స్ మూతపడటం, ఇంట్లో నుండి బయటికి వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో ప్రేక్షకులు ఇంట్లో కూర్చొని OTT లో కొత్త సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేశారు. అయితే లాక్ డౌన్ అయ్యాక థియేటర్స్ ఓపెన్ అయితే ప్రేక్షకులు మళ్ళీ ఎప్పటిలానే థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూస్తారా ? అనేది అందరిలో మొదలైన ప్రశ్న. కొంతమంది ఇక సినిమా హాల్స్ కి వెళ్లి సినిమా చూసే ఆడియన్స్ తక్కువవుతారని థియేటర్స్ పై 'ఓటిటి' పై చేయి సాధిస్తుందని అనుకున్నారు.

అయితే ఎప్పటిలానే సినిమానే పై చేయి సాధించి అందరినీ మళ్ళీ అవాక్కయ్యేలా చేసింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఓపెన్ చేసిన థియేటర్స్ లో రీసెంట్ గా రిలీజైన సోలో బ్రతుకే సో బెటర్ ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ అందుకుంటూ మంచి వసూళ్ళు రాబడుతుంది. మొదటి రోజు నుండి నేటి వరకు సినిమా అన్ని సెంటర్స్ లో స్ట్రాంగ్ గా ఉంది.

దీని బట్టి ఫైనల్ గా ఎవరు ఎన్ని అనుకున్నా సినిమానే గెలిచి సినిమాకి ఎప్పటికి ఆదరణ తగ్గదని నిరూపించింది. సోలో బ్రతుకే సో బెటర్ కి లభిస్తున్న ఆదరణతో సంక్రాంతికి బడా సినిమాలు థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి.