Most Eligible Bachelor Teaser Review
Sunday,October 25,2020 - 12:03 by Z_CLU
అఖిల్ హీరోగా నటిస్తున్న Most Eligible Bachelor Teaser వచ్చేసింది. సినిమా మొత్తం అఖిల్ పెళ్లి చుట్టూ తిరుగుతుందనే విషయం టీజర్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.
పెర్ ఫెక్ట్ లైఫ్ పార్టనర్ కోసం వెదికే అఖిల్, పూజా హెగ్డేకు ఎలా కనెక్ట్ అయ్యాడనేది ఈ బ్యాచిలర్ స్టోరీగా కనిపిస్తోంది. మ్యారీడ్ లైఫ్ పై నీ ఒపీనియన్ ఏంటంటూ అఖిల్ అందర్నీ అడగడం టీజర్ లో బాగుంది.
ఇక Pooja Hegde ఎంటరైనప్పట్నుంచి టీజర్ లో జోష్ కనిపించింది. పూజా ఎక్స్ ప్రెషన్స్ టీజర్ లో హైలెట్ గా నిలిచాయి.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు టీజర్ లో మరోసారి ప్రకటించారు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.