Most Eligible Bachelor not in Sankranthi Race

Saturday,September 19,2020 - 02:15 by Z_CLU

Akhil Akkineni అప్ కమింగ్ సినిమా 'Most Eligible Bachelor' రిలీజ్ డేట్ మారింది. ఇటివలే ఓ పోస్టర్ ద్వారా వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సంక్రాంతి పోటీ నుండి సినిమా తప్పుకుంది. సినిమాను జనవరి 21 పోస్ట్ పోన్ చేసుకున్నారు. రిలీజ్ డేట్ ను స్వయంగా అఖిల్ ప్రకటించాడు.

అఖిల్ కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయగానే నాగ చైతన్య 'Love Story' సంక్రాంతికి రానుందని అందుకే అఖిల్ సినిమా పోస్ట్ పోన్ అయిందని ఫిక్స్ అయిపోయారు అక్కినేని ఫ్యాన్స్. మరి #Akhil4 సినిమా అందుకే పోస్ట్ పోన్ చేసారా అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ అదే నిజమైతే ఒకే నెలలో అక్కినేని బ్రదర్స్ సినిమాలతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.