Most Eligible Bachelor – No OTT Direct Release

Thursday,May 27,2021 - 03:00 by Z_CLU

ప్రస్తుతం అఖిల్ చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. లెక్కప్రకారం ఈపాటికి ఈ సినిమా రిలీజవ్వాలి. కానీ అన్ని సినిమాల్లోనే ఈ మూవీ కూడా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో గాసిప్ బయల్దేరింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారంట.

ఇలా ఈ పుకారు మొదలైన వెంటనే అలా దీనిపై క్లారిటీ ఇచ్చింది గీతాఆర్ట్స్ సంస్థ. అఖిల్-పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీని థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని, ఆ తర్వాతే ఓటీటీలోకి వస్తుందని ప్రకటించారు. నిజానికి ఈ సినిమానే కాదు, గీతాఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కే ఏ సినిమా కూడా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ అవ్వదని ఆ బ్యానర్ నుంచి కొంతమంది క్లారిటీ ఇచ్చారు.

ఈమధ్య కాలంలో చాలా సినిమాలపై ఇలాంటి పుకార్లు వస్తూనే ఉన్నాయి. కానీ సెకెండ్ వేవ్ లో డైరక్ట్ ఓటీటీ రిలీజ్ పై మేకర్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఓ నెల రోజులు లేట్ అయినా థియేటర్లు తెరుచుకుంటాయని, ఆడియన్స్ వస్తారనే నమ్మకం మేకర్స్ లో కనిపిస్తోంది. అందుకే కాస్త నమ్మకం ఉండే ప్రాజెక్టుల్ని వాళ్లు కొన్నాళ్ల పాటు అట్టిపెట్టుకోడానికే ఇష్టపడుతున్నారు.

[caption id="attachment_185938" align="alignnone" width="640"]most eligible bachelor                                 మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో అఖిల్, పూజాహెగ్డే[/caption]

ఇందులో భాగంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను కూడా థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు గీతాఆర్ట్స్-2 బ్యానర్ డిసైడ్ అయింది. ఈ ప్రాజెక్టుపై మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అఖిల్-పూజా కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. అటు గోపీసుందర్ మ్యూజిక్ కూడా హైలెట్ కాబోతోంది.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics