Mehreen still in Holiday mood

Friday,January 22,2021 - 05:31 by Z_CLU

లాక్ డౌన్ తర్వాత హీరోయిన్లంతా వెకేషన్ బాట పట్టారు. కాస్త సేదతీరిన తర్వాత, మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. అయితే ఇక్కడో హీరోయిన్ మాత్రం ఇంకా వెకేషన్ మూడ్ నుంచి బయటకు రాలేదు. ఇప్పటికీ ఆమె తన పర్యటనలు కొనసాగిస్తోంది. తనే మెహ్రీన్.

లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే మాల్దీవులు చెక్కేసింది ఈ బ్యూటీ. కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజులు ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత సినిమాలతో బిజీ అవుతుందని అంతా భావించారు. కానీ మెహ్రీన్ మాత్రం ఇంకా సెట్స్ పైకి రాలేదు. పైపెచ్చు ఇప్పుడు కూడా ఆమె టూర్ లోనే ఉంది.

ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో ఎఫ్3 సినిమా మాత్రమే ఉంది. ఆమె కొత్తగా ఏ ప్రాజెక్టు అంగీకరించలేదు. త్వరలోనే ఆమె మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, దూసుకుపోవడానికి రెడీగా ఉంది.