Meher Ramesh confirms the movie with Chiranjeevi

Saturday,August 29,2020 - 01:29 by Z_CLU

మెహర్ రమేష్.. ఇండస్ట్రీలో ఒకప్పుడు దర్శకుడు. ఇప్పుడు చాలామంది హీరోలకు ఆప్తుడు. చాలా ఏళ్ల కిందటే మెగాఫోన్ పట్టుకోవడం మానేసిన Meher Ramesh.. ఇప్పుడు మరోసారి దర్శకుడిగా మారబోతున్నాడు. అంతేకాదు.. ఈసారి తన చిరకాల కోరిక నెరవేర్చుకోబోతున్నాడు. "నేను సినిమాల్లోకి వచ్చిందే చిరంజీవిని చూసి. ఫారిన్ లో మంచి జాబ్ చేసుకునేవాడ్ని. Chiranjeevi నుంచి స్ఫూర్తి పొంది ఇండస్ట్రీకొచ్చాను. రైటింగ్, డైరక్షన్ అంటే ఇష్టం కాబట్టి అటువైపు వెళ్లాను. నా జీవితాశయమే చిరంజీవితో సినిమా చేయడం. ఇప్పుడా ఆశయానికి కొద్దిగా దగ్గరగా వచ్చాను. చిరంజీవితో సినిమా చేయాలనేది నా డ్రీమ్. అంతకుమించి మరే కోరిక లేదు. ఇప్పుడా డ్రీమ్ సాకారం అవుతోంది."

ఇలా చిరంజీవితో సినిమా చేస్తున్న విషయాన్ని   మెహర్ రమేష్  బయటపెట్టాడు. తను మెగాఫోన్ కు దూరమైనా, ఇండస్ట్రీ పనులతో  బిజీగానే ఉన్నానంటున్నాడు ఈ దర్శకుడు. చాలా స్క్రిప్టుల్లో పాలుపంచుకున్నాడట. గడిచిన మూడేళ్లుగా మాత్రం పూర్తిగా చిరంజీవితో చేయాల్సిన సినిమాపైనే దృష్టి పెట్టానంటున్నాడు  Meher Ramesh.