MegaStar Chiranjeevi’s ‘Waltair Veerayya’ Shooting updates

Thursday,December 01,2022 - 12:07 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి , మాస్ మహారాజ్ కాంబినేషన్ లో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వాల్తేరు వీరయ్య' వచ్చే సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ అవ్వనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజికి చేరుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో  చిరంజీవి , రవితేజ లపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. రెండు మూడు రోజుల పాటు షూట్ జరగనుంది. తర్వాత చిరంజీవి , శృతి హాసన్ లపై అబ్రాడ్ లో ఓ సాంగ్ షూట్ చేయబోతున్నారు.

ఈ సాంగ్ తో టోటల్ షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టేసి ప్రమోషన్స్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే ఆల్బం నుండి రెండో సాంగ్ రిలీజ్ కానుంది. రాబోయే రోజుల్లో ట్రైలర్ రిలీజ్ డేట్ , రిలీజ్ డేట్ వరుసగా అప్ డేట్స్ రాబోతున్నాయి.

   
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics