Megastar Chiranjeevi wishes to Niharika Konidela on her Wedding!

Tuesday,December 08,2020 - 12:04 by Z_CLU

రేపు మెగా డాటర్  Niharika Konidela పెళ్లి పీటలెక్కబోతుంది. ఉదయ్ పూర్లో ఘనంగా జరగనున్న ఈ వెడ్డింగ్ కి ఇప్పటికే మెగా, అల్లు ఫ్యామిలీతో పాటు కొందరు బంధువులు కూడా చేరుకుంది. అయితే రేపు వధువుగా మారబోతున్న నిహారిక కి ట్విట్టర్ ద్వారా స్పెషల్ విషెస్ అందించారు Megastar Chiranjeevi.

"మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే  దంపతులకు నా శుభాకాంక్షలు  , ఆశీస్సులు. God bless you! #NisChayWedding " అంటూ మెగా విషెస్ అందించి కాబోయే వధువువరులను దీవించారు.

Megastar-niharika-konidela-wedding-tweet

అంతే కాదు పాపగా ఉన్న నిహారికను ఎత్తుకున్న ఒకప్పటి ఫోటోతో పాటు లేటెస్ట్ గా నిహారిక పెళ్లి కూతురుగా మారినప్పుడు తన పక్కనే నిల్చున్న ఫోటోను జత చేసి ట్వీట్ చేసి ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ను ఎంజాయ్ చేస్తూ సంబరపడుతున్నారు.