Megastar Chiranjeevi to romance with Shruthi Haasan in Mega154

Thursday,January 06,2022 - 03:30 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి జెట్ స్పీడులో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒకే టైంలో మూడు షూటింగ్స్ లో పాల్గొంటూ అందరికీ షాక్ ఇచ్చారు చిరు. ప్రస్తుతం 'గాడ్ ఫాదర్', 'భోళా శంకర్' సినిమాలు చేస్తున్న చిరు నెక్స్ట్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారు. #MEGA154 గా తెరకెక్కనున్న ఈ సినిమా ఇటివలే గ్రాండ్ లాంచ్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా  శృతి హాసన్ ని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

శృతి హాసన్ ఇప్పటికే మెగా హీరోల్లో చాలా మందితో వర్క్ చేసింది. పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ లతో నటించిన శృతి ఇంత వరకూ మెగా స్టార్ కి జోడి కట్టలేదు. అందుకే ఈ ఫ్రెష్ కాంబోని తన సినిమాకు సెట్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడట దర్శకుడు బాబీ.

ప్రస్తుతం శృతి తెలుగులో రెండు ప్రాజెక్ట్స్ సైన్ చేసింది శృతి. అందులో ఒకటి ప్రభాస్ సలార్ కాగా మరొకటి బాలయ్య -గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కనున్న NBK107. ఇప్పటికే సలార్ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చి వర్క్ ఫినిష్ చేస్తున్న శృతి త్వరలోనే బాలయ్య సరసన నటించనుంది. ఆ సినిమాతో పాటే చిరంజీవి సినిమా కూడా చేసే ఆలోచనలో ఉంది. ప్రస్తుతానికి ఈ విషయంపై మేకర్స్ నుండి ఎలాంటి అప్ డేట్ లేదు. త్వరలోనే శృతి ని ఫైనల్ చేసుకున్నాక ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. మరి ఈ కాంబో ఆడియన్స్ ని ఎలా మెస్మరైజ్ చేస్తుందో చూడాలి.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics