Megastar Chiranjeevi speech about Actors in God Father Pre Release event

Thursday,September 29,2022 - 04:55 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గాడ్ ఫాదర్' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ అనంతపురంలో చాలా గ్రాండ్ గా జరిగింది. వేలాది మంది ప్రేక్షకులు, అభిమానులు హాజరైన ఈ వేడుక కన్నుల పండువగా జరిగింది. వర్షం కురుస్తున్నప్పటికీ వేలాది మంది అభిమానులు కోలాహలం మధ్య ఈ వేడుక  విజయవంతమైయింది.

వేడుకలో మెగా స్టార్ చిరంజీవి సినిమాలో నటించిన ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. చిరు మాట్లాడుతూ " ఇందులో ప్రతినాయకుడిగా సత్యదేవ్ చేశారు. నాకు ఎదురుగా నిలబడే పాత్రది. సత్యదేవ్ అద్భుతమైన నటుడు. ఇందులో ఆయన నటనని పరిపూర్ణంగా వాడుకున్నాం. సత్యదేవ్ కి చాలా మంచి భవిష్యత్ వుంది. మన కళ్ళముందే సత్యదేవ్ సూపర్ స్టార్ గా ఎదుగుతాడు.

సల్మాన్ భాయ్ ఇందులో తన స్టయిల్, గ్రేస్, మస్కులేన్ లుక్స్, ఫైట్స్ తో నా తరపున మీ అందరిని అలరిస్తారు. చాలా అద్భుతంగా వచ్చింది సల్మాన్ పాత్ర.  ఇందులో నేను సల్మాన్ ఒక పాటకు డ్యాన్స్ చేశాం. ఇద్దరి స్టార్లని బ్యాలన్స్ చేస్తూ ప్రభుదేవా అద్భుతంగా ఆ పాటని కొరియోగ్రఫీ చేశారు. గాడ్ ఫాదర్ కి ఆరో ప్రాణం తమన్ మ్యూజిక్. తమన్ మ్యూజిక్ తో ఈ సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. కేవలం కంటిచూపుతోని గొప్ప హీరోయిజం తీసుకొచ్చే పాత్రని ఇందులో చేశాను. తమన్ చాలా అద్భుతమైన రీరికార్డింగ్ చేశారు. గూస్ బంప్స్ వస్తాయి. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఇందులో చాలా అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లు చేశారు.

సినిమాని చూశాను కాబట్టి ఇంత నమ్మకంగా చెబుతున్నాను. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5 విజయదశమి నాడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఆదరించి గొప్ప విజయాన్ని ఇవ్వాలి. ఈ మధ్య చేసిన చిత్రం కాస్త నిరాశ పరిచింది. మిమ్మల్ని సరిగ్గా అలరించలేకపోయాననే అసంతృప్తి వుంది. దీనికి సమాధానమే ఈ సినిమా. గాడ్ ఫాదర్  నిశ్శబ్ద విస్పోటనం. మీ అందరి ఆశీస్సులు కావాలి. " అన్నారు