Megastar Chiranjeevi interview about ‘Waltair Veerayya’

Wednesday,January 11,2023 - 03:18 by Z_CLU

జనవరి 13 న సంక్రాంతి కానుకగా మెగా స్టార్ చిరంజీవి , రవితేజ కాంబో సినిమా 'వాల్తేరు వీరయ్య' థియేటర్స్ లోకి రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్నీ పనులు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు చిరు మాటల్లోనే..

వెరీ ప్రౌడ్ మూమెంట్

ఇవ్వాళ లేవడమే ఓ మంచి హుషారైన శుభవార్త విన్నాను. ప్రతీ ఇండియన్ గర్వపడే రోజిది. గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డు నాటు నాటు సాంగ్ కి రావడం. అందులోకి కీరవాణి గారుఅవార్డుఅందుకోవడం చాలా సంతోషం కలిగించింది. ఈ సందర్భంగా మళ్ళీ కీరవాణి గారికి రాజమౌళి గారికి , దానయ్య గారికి , సింగర్స్ కి , అందులో నటించి మనల్ని మెప్పించి వావ్ అనిపించినా తారక్ , కి చరణ్ కి కంగ్రాట్స్ చెప్తున్నాను. వెరీ ప్రౌడ్ మూమెంట్ ఇది. నాకైతే ఇంత అంతా ఆనందం కాదు.

ఎప్పుడూ స్వర్ణయుగమే

అసలు సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయిందే కేవీ రెడ్డి గారు హెచ్ ఎం రెడ్డి గార్లతో, అప్పుడే స్వర్ణ యుగం మొదలైంది. ఇక ఇప్పుడు శంకర్ , రాజమౌళి , ప్రశాంత్ నీల్ ఆ స్వర్ణయుగానికి సౌత్ ఇండియన్ సినిమా నుండి కొమ్ము కస్తూ ముందుకు సాగుతున్నారు.

ఆ ప్రయత్నమే 'వాల్తేరు వీరయ్య'

నా టాలెంట్ , ఉత్సాహం అంతా బయట పెట్టేది కమర్షియల్ సినిమాల్లోనే , నా ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకొని వారిని ఊహించుకొని రియాక్ట్ అవుతూ యాక్ట్ చేస్తుంటాను. కానీ వైవిద్యమైన పాత్రలు చేయాలని ఎప్పుడూ తపన పడుతూ ఉంటాను. అందులో భాగంగా విశ్వనాథ్ గారితో , బాపు గారితో సినిమాలు చేశాను. అపద్భాంధవుడు, శుభలేఖ, స్వయం కృషి సినిమాలు చేయడానికి కారణం అదే. తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది పక్కన పెట్టేసి ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో అలాంటి సినిమాలు ఇవ్వడం ప్రథమ కర్తవ్యం అనుకుంటున్నా. అందుకే నిర్మాతల , బయ్యర్స్ గురించి ఆలోచించే కమర్షియల్ సినిమాలే చేస్తూ వచ్చాను. కమ్ బ్యాక్ తర్వాత కూడా ఫ్రీడం ఫైటర్ గా సైరా ,సాంగ్స్ లేకుండా విభిన్న పాత్రతో 'గాడ్ ఫాదర్' చేశాను. కానీ ప్రేక్షకులు వంద శాతం నా నుండి ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వాలన్న ప్రయత్నమే 'వాల్తేరు వీరయ్య'. ఇది అందరినీ అలరిస్తుంది. వింటేజ్ చిరంజీవిను గుర్తుచేసుకునే ఛాన్స్ ఉంటుంది. నేను కూడా అవన్నీ రీ కలెక్ట్ చేసుకొని వైబ్రేట్ అవుతూ ఘాట్ చేశాను.

వాళ్ళకి కంఫర్ట్ ఇస్తా

నేనెప్పుడూ శాట్ అవ్వగానే వెళ్ళి మానిటర్ చూడను. డైరెక్టర్ కానీ , ఫైట్ మాస్టర్ కానీ , డాన్స్ మాస్టర్ యెస్ చెప్పెవరకూ స్పాట్ లోనే ఉంటాను. ఒక కొత్త యాక్టర్ ని వాళ్ళు డీల్ చేసినప్పుడు ఎంత కంఫర్ట్ ఫీలవుతారో అదే ఇవ్వడానికి చూస్తుంటాను. మిగతా రెస్పెక్ట్ అంతా ప్యాకప్ తర్వాతే అందుకుంటాను. ఘాట్ లో మాత్రం నేను ఇంకా కొత్త నటుడిలానే ఉంటాను.

కష్టపడకపోతే రిటైర్ అవ్వాల్సిందే

ఎవరైనా కష్టపడాలి. మనకి డబ్బు ఇస్తుంది ఆ కష్టానికే కదా అని గుర్తించాలి. అలా కష్టపడని రోజు నటుడిగా రిటైర్ అవ్వడమే కరెక్ట్ . అమితాబ్ బచ్చన్ గారు ఈరోజుకి కష్టపడుతున్నారు. ఈ వయసులో ఆయన కష్టం చూస్తూ మేము ఇన్స్పైర్ అవుతుంటాం. మొదటి రోజుల్లో కసితో పని చేస్తాం కదా ఆరోజు ఉన్న స్పిరిట్ ఇప్పుడు ఉండకపోతే ఎలా ? కష్టపడాలి. ఎప్పుడూ బెస్ట్ ఇవ్వాలంటే అర్థాకలి తో అయినా ఉండాలి. అలా కాకపోతే నువు అనుకున్నది డెలివరీ చేయలేవు.

ప్రేక్షకులే డ్రైవింగ్ ఫోర్స్

నాకెప్పుడూ ప్రేక్షకులే డ్రైవింగ్ ఫోర్స్. వాళ్ళు ఆదరించినంత కాలం నాకు ప్రతీ రోజు అదే డ్రైవింగ్ ఫోర్స్ గా ఉంటుంది. బావగారు బాగున్నారా ? లో బంగీ జంప్ చేశానంటే ఆ క్షణం నాకు కూడా కాళ్ళు వణికాయ్. కానీ ఆ క్షణం ప్రేక్షకులు స్క్రీన్ మీద చూసి వావ్ వాట్టె ఫీట్ అంటూ ఎంజాయ్ చేసే మూమెంట్ గుర్తుచేసుకొని ట్రాన్స్ ఫార్మ్ అయిపోయాను. అందువల్లే జంప్ ఎంజాయ్ చేయగలిగాను. ఆ వీడియో చూస్తే మధ్యలో నేను షర్ట్ పైకి అడ్జస్ట్ చేసుకుంటాను. అక్కడే గమనించవచ్చు నేను భయం మార్చి ఎంజాయ్ చేశానని.

రవితేజ ఇప్పుడూ అలాగే

రవితేజ ను చూస్తే ఎప్పుడేలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అప్పట్లో ఎంత సరదాగా , ఎనర్జిటిక్ గా ఉన్నాడో ఈరోజుకి అదే ఎనర్జీ , సరదాగా గా కనిపిస్తున్నాడు. 'ఆజ్ కా గుండా రాజ్' లో ఫ్రెండ్ గా చేశాడు, అన్నయ్యలో తమ్ముడిగా చేశాడు. అప్పుడు జస్ట్ అప్ కమింగ్. ఆరోజు ఉన్న క్రమశిక్షణ , ఆహారపు అలవాట్లు కూడా సేమ్. ఎప్పుడు ఒక స్ట్రైట్ లైన్ గా ఉండే వ్యక్తి రవితేజ.

ఇలాంటి నిర్మాతల్ని రేర్ గా చూస్తుంటాం

మైత్రి నిర్మాణం గురించి చెప్పాలంటే వాళ్ళ లాంటి నిర్మాతలు రేర్ గా ఉంటారు. మిగతా వారిని తక్కువ చేయడం కాదు కానీ డబ్బు కోసం కాకుండా ఒక ప్యాషన్ తో సినిమాలు నిర్మించే సంస్థ ఇది. ఖర్చు జాగ్రత్త అంటూ వారిని ఎప్పుడూ వార్న్ చేస్తుంటాను. మీలాంటి నిర్మాతలు మాకు కావాలి అంటూ ఉంటాను. బాబీ కి కూడా చెప్తూనే ఉన్నాను. ముందు నుండి వేస్టేజ్ లేకుండా చూసుకుంటూ కంప్లీట్ చేశాం. వేస్టేజ్ అనేది పేపర్ మీద ఉండాలి తప్ప సెట్స్ పైకి వెళ్ళాక ఉండకూడదనే మెంటాలిటీ నాది. ప్రతీ ఒక్కరితో మాట్లాడుతూ టైమ్ కాలుక్యులేట్ చేస్తూ నిర్మాత శ్రేయస్సు కోరి వర్క్ చేశాను.

నేనే వెనక్కి జరిగాను

మా సంస్థలోనే రెండు సినిమాలు అనేది నేను చాలా హెల్తీ గా ఫీలయ్యాను. నిర్మాతలతో మాట్లాడాను , మీకు కష్టమేమో , బయ్యర్లు ఇబ్బంది పడతారేమో చూసుకోండి అన్నాను. వాళ్ళు ఏం పర్లేదన్నారు. పండగ కాబట్టి ఎన్ని సినిమాలు అయినా చూస్తారు కాబట్టి ,ఒకదాని మీద ఒకటి వేసుకోవడం అక్కర్లేదు. వన్ డే గ్యాప్ ఇస్తే ఏ సినిమా రెవెన్యూ ఆ సినిమాకి వస్తుందని భావించి ఒకే రోజు షేర్ చేసుకోవడం వద్దని నెనే వెనక్కి జరిగాను.

 

ఇంత మాసీ గెటప్ వేయలేదు

ఈ సినిమాలో నా కాస్ట్యూమ్స్ బాగున్నాయని అంటున్నారు. మా అమ్మాయి సుస్మిత కొంత రీసెర్చ్ చేసి డిజైన్ చేసింది. ఫిషర్ మెన్ అయినప్పటికీ కలర్ ఫుల్ షర్ట్స్ , వాచ్ పెట్టుకునే పాత్ర ఇది. వాళ్ళు వేరే విధంగా సంపాదిస్తారని అలా డిజైన్ చేశాం. ఈ మధ్య కాలంలో నేను ఇంత మాసీగా కనిపించలేదు. వీరయ్య కాబట్టి కుదిరింది.

 

బాబీలో అదే నచ్చింది

టెక్నాలజీ వాడకం పెరిగిన ఈరోజుల్లో నేను మాత్రం కంటెంట్ నే నమ్ముతాను. అదే లక్షణం బాబీలో చూశాను. తాను కూడా కంటెంట్ గురించి తాపత్రయ పడే వ్యక్తి. అందుకే మా ఇద్దరికీ బాగా కుదిరింది. నా అభిమాని అయినప్పటికీ , తన టాలెంట్ తో దర్శకుడిగా నా దగ్గర ఎక్కువ మార్కులు సంపాదించాడు.

 

తనకి ఫ్యాన్ బాయ్ మూమెంట్

నేను రవితేజ ఇద్దరం కలిసి ఒకరి డైలాగ్ మరొకరు చెప్పడం ట్రైలర్ లో అందరినీ ఆకర్షించింది. అయితే మరో హీరో డైలాగ్ చెప్పడం అంటే రవితేజ తోనే కుదిరింది. తను నా అభిమాని కాబట్టి బాబీ ఆ సీన్ అలా డిజైన్ చేశాడు. బాగుందని నేను ఆమోదించాను. కచ్చితంగా రవితేజ కి నా డైలాగ్ చెప్పడం ఓ ఫ్యాన్ బాయ్ మూమెంట్. నా తమ్ముడి లాంటి రవితేజ డైలాగ్ నేను చెప్పడం కూడా సరదాగా అనిపించింది.

 

దర్శకత్వం చేస్తాను

జీవితాంతం సినిమాతో మమేకం అవ్వాలనే వుంది. ఏదొక ఒక సమయంలో ఆలాంటి సందర్భం వచ్చి, దర్శకత్వం చేయగలననే నమ్మకం వస్తే గనుక దర్శకత్వం చేస్తాను.

 

ప్రభుత్వాలకు నా ధన్యవాదాలు

ప్రభుత్వ నిర్ణయాలని మనం గౌరవించాలి. ఈ వెసులు బాటు కల్పించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.