Megastar Chiranjeevi, Global Star Ram Charan praise Brahmanandam’s moving performance

Thursday,March 23,2023 - 06:38 by Z_CLU

Megastar Chiranjeevi, Global Star Ram Charan praise Brahmanandam's moving performance

కృష్ణ వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన 'రంగమార్తాండ' ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. రిలీజ్ కి ముందే ప్రీమియర్ షోలతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాను తాజాగా మెగా స్టార్ చిరంజీవి ప్రత్యేకంగా చూశారు. సినిమాలో డా.బ్రహ్మానందం నటనకు గానూ మెస్మరైజ్ అయిన చిరు వెంటనే ఆయన్ను తనయుడు రామ్ చరణ్ తో కలిసి అభినందించారు.

హైదరాబాద్ లో రామ్ చరణ్ -శంకర్ సినిమాకు సంబంధించి షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్ స్పాట్ లోనే చిరు , చరణ్ బ్రహ్మానందంను శాలువాతో సత్కరించి ఆయన గొప్ప నటనను మెచ్చుకున్నారు. 'రంగమార్తాండ'లో చక్రపాణి అనే రంగస్థల నటుడి పాత్రలో కనిపించి బ్రహ్మానందం అందరి చేత మన్ననలు అందుకుంటున్నారు. ముఖ్యంగా రెండు ఎమోషనల్ సన్నివేశాల్లో బ్రహ్మీ గొప్ప నటన కనబరిచి ప్రేక్షకులను కంటతడి పెట్టించారు.

ఈ మధ్య నటుడిగా కాస్త బ్రేక్ తీసుకున్న బ్రహ్మానందం 'రంగమార్తాండ' తో తనలో మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించి ప్రశంసలు అందుకుంటున్నారు. మెగా స్టార్ తన తనయుడు చరణ్ తో కలిసి తన నటనపై ప్రత్యేక ప్రశంసలు కురిపించడంతో బ్రహ్మానందం తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.