Maruthi’s ‘Manchi Rojulochaie’ Release Trailer out!

Saturday,October 30,2021 - 05:55 by Z_CLU

మారుతి సినిమా అంటే ఎక్కువ మోతాదులో వినోదం ఉంటుంది. తాజాగా రిలీజైన 'మంచి రోజులొచ్చాయి' ట్రైలర్ తో మారుతి నుండి మంచి మంచి హిలేరియస్ ఎంటర్టైనర్ రానుందని అర్థమవుతుంది. సంతోష్ శోభన్ , మెహ్రీన్ జంటగా మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కిన 'మంచి రోజులు వచ్చాయి' దీపావళి కానుకగా నవంబర్ 4న రిలీజవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.

ఈ సినిమాతో మారుతీ ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నాడో రెండు నిమిషాల లోపు ట్రైలర్ తో క్లియర్ కట్ చెప్పేశాడు. కరోన భయం , లాక్ డౌన్ ఇబ్బందులు వీటితో ఒక కథను రెడీ చేసుకొని దానికి మించి కూడా ఏదో చెప్పనున్నాడని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా సినిమాలో అజయ్ ఘోష్ పాత్ర చాలా కీలకంగా ఉండనుందని అతని పాత్రతో హిలేరియస్ ఎంటర్టైన్ మెంట్ ఉండనుందని ట్రైలర్ తో హిట్ ఇచ్చేశారు.

అలాగే సంతోష్ శోభన్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , మెహ్రీన్ గ్లామర్ క్యారెక్టర్ సినిమాకు ప్లస్ కానున్నాయని అర్థమవుతుంది. అనూప్ మ్యూజిక్ , సాయి శ్రీరాం కెమెరా వర్క్ ట్రైలర్ ని మరింత ఎట్రాక్టివ్ గా తీర్చిదిద్దింది. ఫైనల్ గా 'ప్రతి రోజు పండగే' తర్వాత మారుతి నుండి రానున్న ఈ సినిమాలో అదే స్థాయిలో ఎంటర్టైన్ చేసే పాత్రలు ,హిలేరియస్ ఫన్ ఉండనుందనే ట్రైలర్ కట్ తో అర్థమవుతుంది. ఒవరాల్ గా నిమిషం యాబై సెకన్ల నిడివితో రిలీజైన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచి ఎంటర్టైన్ మెంట్ కోసం ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించేలా ఉంది. v సెల్యులాయిడ్ , ఎస్ కె ఎన్ నిర్మిస్తున్న ఈ సినిమా అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజర్.

-  తన పెళ్లి గురించి నాగ శౌర్య ఏమన్నాడంటే ?

మరి దీపావళి కానుకగా థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమా మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుందా ? చూడాలి.

- Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics