Maruthi is planning an OTT movie with Santosh Sobhan and Mehreen

Tuesday,June 08,2021 - 01:55 by Z_CLU

ప్రస్తుతం కాన్సెప్ట్ సినిమాలకు , కామెడీ ఎంటర్టైనర్ సినిమాలను మంచి డిమాండ్ ఉంది. థియేటర్స్ అయినా OTT అయినా ఇలాంటి సినిమాలనే ప్రేక్షకులు ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు డైరెక్టర్స్ ఈ కోవలో కొన్ని సినిమాలు చేస్తున్నారు. అయితే ఎప్పటి నుండి కాన్సెప్ట్ సినిమాలు నిర్మిస్తూ వస్తున్న మారుతీ కూడా కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ కాన్సెప్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను తనే డైరెక్ట్ చేయబోతున్నాడు.

santosh sobhan mehreen zeecinemalu

ఇటివలే ఏక్ మినీ కథ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న హీరో సంతోష్ శోభన్ ని హీరోగా పెట్టి మారుతి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో హీరోయిన్ గా మెహ్రీన్ ని తీసుకున్నారు. వచ్చే నెలలో సినిమా షూటింగ్ మొదలు పెట్టి నెల రోజుల్లో కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యాడు మారుతి. అయితే ఇది థియేటర్స్ కోసం చేస్తున్న సినిమా కాదట. OTT కోసం చేస్తున్న ఫన్నీ కాన్సెప్ట్ సినిమా అని సమాచారం.

లాక్ డౌన్ లో ఒక కాన్సెప్ట్ రెడీ చేసుకొని ఇటివలే సంతోష్ శోభన్, మెహ్రీన్ లను సంప్రదించి వీళ్ళిద్దరినీ ఫైనల్ చేసుకున్నాడట మారుతి. అయితే ఈ సినిమాను ఏ OTT కోసం చేస్తున్నాడు ? మారుతి కి ఆఫర్ ఇచ్చిందెవరు? అనేది తెలియాలి ఉంది. త్వరలోనే సైలెంట్ గా ఈ సినిమాను ఫినిష్ చేసి OTT ఆడియన్స్ ముందు పెట్టనున్నారు.

  •  Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics