Manchu Vishnu’s Ginna Teaser Review

Tuesday,September 13,2022 - 02:49 by Z_CLU

హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా'. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య దర్శకుడు. భారీ తారాగణం, బడా సాంకేతిక నిపుణులతో తెరకెక్కుతోంది ఈ సినిమా. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు జి. నాగేశ్వర్ రెడ్డి కథ అందించగా.. కోన వెంకట్ స్క్రిప్టు సమకూర్చి పెట్టాడు.

జిన్నా టీజర్ వేడుక హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్, కోన వెంకట్, అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు. తాజాగా విడుదలైన టీజర్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.

జిన్నా పాత్ర ఛాయల్ని టీజర్ లో ఎలివేట్ చేశారు. విష్ణు డైలాగ్ డిక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీజర్ ని బట్టి చూస్తే ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్ లా అనిపిస్తున్నప్పటికీ.. టీజర్ చివరిలోని థ్రిల్లింగ్ హారర్ ఎలిమెంట్స్ సర్ ప్రైజ్ చేస్తున్నాయి. టీజర్ లో డైలాగ్స్ బాగున్నాయి. హారర్ ఎలిమెంట్స్ మెప్పించేలా తెరకెక్కించారు.

అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగున్నాయి. అయితే ఓవరాల్ గా టీజర్ చూస్తుంటే మాత్రం హారర్, కామెడీ హైలెట్ గా కనిపిస్తున్నాయి. ఈ జానర్ సినిమాలు ప్రేక్షకులకు కొత్తకాదు. ఇవి కాకుండా, ఇంకేమైనా కొత్తదనం ఉందేమో తెలుసుకోవాలంటే, ట్రయిలర్ రిలీజ్ వరకు ఆగాల్సిందే. జిన్నా సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేస్తున్నారు.