Manchi Rojulochaie Trailer Review

Thursday,October 14,2021 - 12:27 by Z_CLU

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా ''మంచి రోజులు వచ్చాయి''. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఆద్యంతం వినోదాల విందుగా ఈ ట్రైలర్ సాగింది.

ట్రయిలర్ లో డైలాగులు బాగున్నాయి. ‘యువీ వాళ్లు రాధేశ్యామ్ తీసారని ఊరికే ఉన్నారా.. ఏక్ మినీ కథ తీయలేదూ.. కంటెంట్ ఎక్కడుంటే అక్కడికి వెళ్లిపోవడమే’ అంటూ సరదా సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. సంతోష్ శోభన్, మెహ్రీన్ మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉంది. అలాగే అజయ్ ఘోష్ కామెడీ ట్రైలర్‌లో ఆకట్టుకుంది.

Manchi Rojulu vachaie mehreen santosh sobhan

దీపావళి సందర్భంగా నవంబర్ 4న మంచి రోజులు వచ్చాయి సినిమా విడుదల కానుంది. మహానుభావుడు లాంటి సూపర్ హిట్ తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు. టాక్సీవాలా తర్వాత ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

manchi rojulochaie
  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics