ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్న హీరో అఖిల్ నెక్స్ట్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో 'ఏజెంట్' అనే సినిమా చేస్తున్నాడు. ఇటివలే సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకుంది. నెక్స్ట్ షెడ్యుల్ యూరప్ లో ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో కీలకమైన పాత్ర కోసం ఇటివలే మలయాళ నటుడు మమ్ముట్టి ని సంప్రదించారని తెలుస్తుంది. క్యారెక్టర్ నచ్చితే తెలుగులో సినిమా ఒప్పుకొనే మమ్ముట్టి ఈ సినిమాలో తన రోల్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని సమాచారం.
అయితే మమ్ముట్టి కంటే ముందు మేకర్స్ మోహన్ లాల్ ని కూడా సంప్రదించారని టాక్. ఫైనల్ గా మోహన్ లాల్ ప్లేస్ లో ఇప్పుడు మమ్ముట్టి ని కన్ఫర్మ్ చేసుకున్నారట. త్వరలోనే మేకర్స్ మమ్ముట్టి కి ప్రాజెక్ట్ లోకి వెల్కం చెప్తూ ప్రకటన ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. అయితే సినిమాలో అఖిల్ డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడని ఫస్ట్ లుక్ తోనే క్లారిటీ ఇచ్చేశాడు సురేందర్ రెడ్డి. మరి ఇందులో మమ్ముట్టి పాత్ర ఎలా ఉంటుంది ? అనేది ఇప్పుడు చర్చనియంశం అయింది. మమ్ముట్టి ఇందులో ఒక ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తారనే టాక్ వినబడుతుంది.
ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ -మాటలు అందిస్తుండగా , తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీతో డిఫరెంట్ గా కనిపించనున్నాడు అఖిల్. మమ్ముట్టి నటిస్తున్నాడనే న్యూస్ తో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అవుతుంది.
- Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics