Malvika Sharma becomes Lawyer in real life
Wednesday,January 06,2021 - 04:38 by Z_CLU
హీరోయిన్ మాళవిక శర్మ (Malvika Sharma) లాయర్ గా మారింది. ఇదేదో సినిమాలో గెటప్ అనుకోవద్దు. ఆమె నిజజీవితంలో లా చదివింది. ఇప్పుడు పట్టా పుచ్చుకుంది. తను లాయర్ గా మారిన విషయాన్ని మాళవిక శర్మ స్వయంగా ప్రకటించింది.
ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు చదువును కొనసాగిస్తుంటారు హీరోయిన్లు. ఎంతోమంది అలా చదువుకుంటున్నారు. రకుల్, కాజల్ లాంటి హీరోయిన్లు అయితే ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో డిగ్రీలు అందుకుంటూనే ఉన్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మాళవిక శర్మ కూడా చేరిపోయింది.
తెలుగులో నేలటిక్కెట్ సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ, ప్రస్తుతం రామ్ సరసన రెడ్ అనే సినిమాలో నటించింది. ఇప్పటికే రిలీజైన స్టిల్స్ లో రామ్-మాళవిక పెయిర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా. సంక్రాంతి కానుకగా రాబోతోంది రెడ్ మూవీ.