Makers planning Pushpa Teaser launch as big event !

Tuesday,April 06,2021 - 01:04 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేపు 'పుష్ప' సినిమాకు సంబంధించి  ఓ టీజర్ వదలనున్నారు మేకర్స్.  'ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్' పేరుతో రేపు సాయంత్రం రిలీజవుతున్న ఈ టీజర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఇప్పటికే గ్లిమ్ప్స్ ద్వారా క్లారిటీ ఇస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో విడుదల చేశారు.  టీజర్ లో పుష్ప క్యారెక్టర్ , సుక్కు టేకింగ్ , దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ స్పెషల్ హైలైట్స్ గా నిలుస్తూ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేయనున్నాయని ఇన్సైడ్ టాక్. ఇటివలే ఓ సినిమా ఫంక్షన్ లో 'తగ్గేదే లే' అంటూ బన్నీ చెప్పిన డైలాగ్  టీజర్ లో ఉండనుందని తెలుస్తుంది.

షూటింగ్ మొదలు కాకముందే  బన్నీ లుక్ రివీల్ చేసి ఎప్పటికప్పుడు అభిమానులకు అప్డేట్స్ అందిస్తూ ప్రమోషన్స్ లో ముందున్న 'పుష్ప' టీం రేపటి నుండి ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచనున్నారు. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ రేపు JRC లో జరగబోయే ఈవెంట్ తో మొదలు కానున్నాయి. ఈ ఈవెంట్ కి బన్నీ అభిమానులు భారీగా హాజరుకానున్నారు. రిలీజ్ లోపు మరిన్ని ప్రమోషన్ ప్లాన్స్ తో టీం అభిమానులను సప్రైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో అల్లుఅర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్ట్ 13న సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది.