Mahesh’s Sarkaru Vaari Paata shoot may start in USA from November

Sunday,September 13,2020 - 09:01 by Z_CLU

అన్నీ అనుకున్నట్టు జరిగితే నవంబర్ నుంచి సర్కారువారి పాట సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అంతేకాదు.. ఈ షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు.

కథ ప్రకారం అమెరికాలో కొన్ని కీలక సన్నివేశాలు తీయాలి. ఆ సీన్స్ ను ఫస్ట్ షెడ్యూల్ లోనే పూర్తిచేయాలనేది యూనిట్ ప్లాన్. ఇందులో భాగంగా దర్శకుడు పరశురామ్ త్వరలోనే USA వెళ్లబోతున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన ఓ నిర్మాత అమెరికాలోనే ఉన్నాడు. ఆయన ఈ షెడ్యూల్ కు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తిచేయబోతున్నాడు. వీలైతే డెట్రాయిట్ లో Sarkaru Vaari Paata ఫస్ట్ షెడ్యూల్ మొదలవుతుంది. కాకపోతే వీసా ప్రాసెస్ పూర్తికావాల్సి ఉంది.

తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ 3 ట్యూన్స్ ఫైనల్ చేశారు. సినిమాలో Mahesh సరసన Keerthy Suresh ను హీరోయిన్ గా తీసుకున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై రాబోతోంది సర్కారువారి పాట.