Mahesh Trivikram Movie on cards
Wednesday,April 07,2021 - 07:36 by Z_CLU
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ కు ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన అతడు సినిమాను టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది క్లాసిక్స్ గా చెబుతారు. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ఖలేజా సినిమా ఫెయిల్ అయినప్పటికీ.. మహేష్ ను అంత కామెడీ యాంగిల్, అంతే సరదాగా చూపించిన మూవీ ఇప్పటివరకు రాలేదు.
అయితే ఖలేజా తర్వాత మహేష్-త్రివిక్రమ్ మళ్లీ కలవలేదు. కారణాలు ఏమైనా ఇద్దరూ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ టైమ్ రానేవచ్చింది. 11 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత Mahesh-Trivikram కలిసి సినిమా చేయబోతున్నారనేది హాట్ టాపిక్.
మహేష్ బాబుకు ఫోన్ ద్వారా స్టోరీలైన్ వినిపించాడట త్రివిక్రమ్. స్టోరీలైన్ నచ్చడంతో మహేష్ ఓకే చెప్పడం.. ఆ వెంటనే స్క్రిప్ట్ డెవలప్ మెంట్ పనులు వేగంగా ఊపందుకోవడం చకచకా జరిగిపోయాంటున్నారు.
మహేష్-త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా వచ్చే ఛాన్స్ ఉందంటూ దాదాపు ఏడాదిగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లకు అవి నిజమ్యయేలా ఉన్నాయి. ఫైనల్ నెరేషన్ కంప్లీట్ అయితే, ఎప్పట్లానే హారిక-హాసిని బ్యానర్ పై ఈ ప్రాజెక్టు పట్టాలపైకి వస్తుంది. ఈ మూవీలో పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకుంటున్నారు.
అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఎందుకంటే, మహేషఅ బాబు సర్కారువారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటు త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ తో ఓ సినిమాకు కమిట్ అయి ఉన్నాడు.
- - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics