Mahesh Sarkaru Vaari Paata Shoot from January

Sunday,October 11,2020 - 01:27 by Z_CLU

ఇటివలే ఎనౌన్స్ అయిన Mahesh Babu , Parasuram కాంబినేషన్ సినిమా 'Sarkaru Vaari Paata' నవంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడీ సినిమా షూటింగ్ వాయిదా పడిందని తెలుస్తుంది. మరో రెండు నెలలు ఆగి జనవరి నుండి సినిమా షూటింగ్ ప్రారంభిస్తారట.

జనవరి నుండి USA లో ఓ లాంగ్ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. డెట్రాయిట్, సియాటిల్ లాంటి ప్రాంతాల్లో దర్శకుడు పరశురామ్ ఇప్పటికే కొన్ని లొకేషన్లు ఫిక్స్ చేశాడు. కీలకమైన యూఎస్ షెడ్యూల్ పూర్తయితే, మిగతా భాగం మొత్తం ఇండియాలోనే తీస్తారు.

ALSO READ - మహేష్ కోసం శృతి కలిపింది

మహేష్ సరసన Keerthy Suresh హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు  Thaman మ్యూజిక్ అందిస్తున్నాడు. Mythri Movie Makers , 14 Reels Plus నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.