Mahesh Reaction on Pawan’s Vakeel Saab Movie

Sunday,April 11,2021 - 03:53 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్. ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ కు, ఆడియన్స్ కు మాత్రమే కాదు.. టోటల్ ఇండస్ట్రీకి కూడా ఎక్కేసింది. చాలామంది హీరోలు వకీల్ సాబ్ ను, అందులో పవన్ పెర్ఫార్మెన్స్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మహేష్ బాబు కూడా చేరాడు.

వకీల్ సాబ్ సినిమా అద్భుతంగా ఉందని మెచ్చుకున్న మహేష్ బాబు.. పవన్ కల్యాణ్ ప్రస్తుతం టాప్ ఫామ్ లో ఉన్నాడంటూ ఆకాశానికెత్తేశాడు. వకీల్ సాబ్ లో పవన్ కల్యాణ్, పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని మెచ్చుకున్నాడు. పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ అదిరిపోయిందంటూ చప్పట్లు కొడుతూ ఎమోజీలు పెట్టాడు సూపర్ స్టార్.

mahesh pawan vakeel saab

ఇలా పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా అభినందించిన మహేష్.. ఆ వెంటనే సినిమాను, అందులో నటించిన ఇతర నటీనటుల్ని కూడా మెచ్చుకున్నాడు. మరీ ముఖ్యంగా ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయిందంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు మహేష్. నివేత, అంజలి, అనన్య చాలా చక్కగా నటించారని.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టాప్ లెవెల్లో ఉందంటూ స్పెషల్ మెన్షన్ ఇచ్చాడు. ఇక ఫైనల్ గా సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయినందుకు దర్శకుడు వేణుశ్రీరామ్, నిర్మాత దిల్ రాజుకు అభినందనలు అందించాడు మహేష్ బాబు.

పవన్ కల్యాణ్, మహేష్ బాబు పెద్దగా కలుసుకోరు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ అయితే గడిచిన మూడేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. కానీ వీళ్లిద్దరీ బెస్ట్ ఫ్రెండ్స్. ప్రత్యక్షంగా కలుసుకోనప్పటికీ.. ఫోన్ లో రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. అందుకే పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ మూవీ కోసం మహేష్ బాబు ఈగర్ గా వెయిట్ చేశాడు. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయిన వెంటనే చూశాడు. ఇలా తన ఆనందాన్ని పంచుకున్నాడు.

ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి వసూళ్లతో, బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics