Mahesh Babu’s ‘Sarkaru Vaari Paata’ Release on April 2022 ?

Wednesday,October 27,2021 - 01:22 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు , పరశురాం (బుజ్జి) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' సినిమాకు సంబంధించి ఓ ప్రచారం జరుగుతుంది. ముందుగా ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ 'ఆర్ ఆర్ ఆర్' , 'రాధే శ్యామ్' వంటి పాన్ ఇండియా సినిమాలు రేస్ లోకి వచ్చే సరికి ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఉగాది కానుకగా సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నారని త్వరలోనే ప్రకటన కూడా రానుందని సమాచారం. అయితే ఇంత వరకూ సినిమా రిలీజ్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. దీపావళి రోజు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటివలే స్పెయిన్ షెడ్యుల్ ఫినిష్ చేసుకొని వచ్చారు. నెక్స్ట్ హైదరాబాద్ లో మరో షెడ్యుల్ ప్లాన్ చేసుకుంటున్నారు. దీపావళి కి సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఈ సాంగ్ కోసం అలాగే రిలీజ్ డేట్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటివలే రిలీజైన టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. సినిమాలో మహేష్ మళ్ళీ తనదైన స్టైల్ లో హిలేరియస్  కామెడీ చేయనున్నాడని టీజర్ చూస్తే అర్థమవుతుంది. చూడాలి మరి మహేష్ ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడో ?

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics