Mahesh Babu, Trivikram’s #SSMB28 titled Arjunudu ?

Wednesday,May 25,2022 - 03:24 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రానున్న SSMB28 సినిమాకు సంబంధించి తాజాగా ఓ టైటిల్ చక్కర్లు కొడుతుంది. సినిమాకు 'అర్జునుడు' అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారని టాక్. అయితే గతంలో మహేష్ 'అర్జున్' అనే టైటిల్ తో గుణ శేఖర్ తో సినిమా చేశాడు. ఇక ఈ టైటిల్ లో మహేష్ సెంటిమెంట్ తో పాటు త్రివిక్రమ్ సెంటిమెంట్ కూడా కనిపిస్తుంది.

మహేష్ చివర్లో 'డు' అక్షరం బాగా కలిసొస్తుంది. 'ఒక్కడు','అతడు','సైనికుడు','దూకుడు' ,'శ్రీమంతుడు' ఆ సెంటిమెంట్ తో పెట్టినవే. ఇక త్రివిక్రమ్ కి కూడా 'అ' అక్షరంతో సెంటిమెంట్ ఉంది. 'అతుడు', 'అత్తారింటికి దారేది','అ ఆ','అరవింద సమేత', అల వైకుంఠ పురములో' ఇలా మొదటి అక్షరం అ తో పెట్టిన సినిమాలన్నీ త్రివిక్రమ్ కి మంచి సక్సెస్ అందించాయి. అందుకే ఈ ఇద్దరి కాంబో సినిమాకు ఈ టైటిల్ నే ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే సినిమా లాంచ్ కానుంది జూన్ లేదా జులై నుండి షూటింగ్ మొదలవుతుంది. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. హారికా హాసినీ క్రియేషన్స్ బేనర్ పై రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్ గా రెడీ చేయాలని భావిస్తున్నారు.

   
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics