Mahesh Babu , Pawan Kalyan films releasing on Sankranthi 2022 !

Monday,March 01,2021 - 01:43 by Z_CLU

ప్రతీ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతుండటం, భారీ కలెక్షన్స్ తో హంగామా చేయడం సహజమే.  వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా ఇద్దరు టాప్ స్టార్లు తమ సినిమాలతో పోటీ పడబోతున్నారు. అవును మహేష్ బాబు 'సర్కారు వారి పాట' తో పాటు పవన్ కళ్యాణ్ PSPK27 సినిమా కూడా 2022 సంక్రాంతి బరిలో నిలిచింది. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న తమ సినిమాల రిలీజ్ డేట్స్ ని తాజాగా ప్రకటించి ఇప్పటి నుండే ఆ సినిమాలపై అంచనాలు నెలకొలుపుతున్నారు.

SarkaruVaariPaata-PSPK-Release-on-sankranthi-2022

ప్రతీ సంక్రాంతికి టాలీవుడ్ లో ఓ రేంజ్ బిజినెస్ జరుగుతుంది. ఇక టాప్ స్టార్ల సినిమాలు విడుదలైతే వందల కోట్ల బిజినెస్ జరగడం ఖాయం. ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ రెండు సినిమాల బిజినెస్ హాట్ టాపిక్ గా మారింది. అటు మహేష్  'సర్కారు వారి పాట' , ఇటు 'PSPK27' సినిమాలపై ఓపెనింగ్ నుండే మంచి బజ్ ఉంది. మరి ఈ సినిమాలతో సంక్రాంతి పోటీలో నిలుస్తున్న పవన్ , మహేష్ ఎలాంటి విజయాలు అందుకుంటారో సంక్రాంతి విన్నర్ టైటిల్ ఎవరు కైవసం చేసుకుంటారో ఇప్పటి నుండే చర్చనియంశం అవుతోంది.