Mahesh Babu is back to the sets

Wednesday,September 09,2020 - 05:00 by Z_CLU

హీరో మహేష్ బాబు సెట్స్ పైకొచ్చాడు. ఈ ఏడాది మహేష్ ఇలా సెట్స్ పైకి రావడం ఇదే ఫస్ట్ టైమ్. అయితే ఇది అతడి కొత్త సినిమా షూటింగ్ కాదు. ఓ యాడ్ షూటింగ్.

సరిలేరు నీకెవ్వరు తర్వాత కాస్త గ్యాప్ తీసుకుంటానని ప్రకటించాడు Mahesh. ఆయన గ్యాప్ తీసుకోవడం, ఆ వెంటనే కరోనా రావడంతో.. ఈ ఏడాదంతా గ్యాప్ తీసుకున్నట్టయింది. పరశురామ్ దర్శకత్వంలో SarkaruVaariPaata సినిమా ఎనౌన్స్ చేసినప్పటికీ లాక్ డౌన్ వల్ల షూట్ స్టార్ట్ చేసే పరిస్థితి లేదు.

ఇలాంటి సిచ్యుయేషన్ లో మహేష్ సెట్స్ పైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే ఊపులో ఆయన సర్కారువారి పాట సినిమా కూడా స్టార్ట్ చేస్తే చూడాలని ఉందంటూ అభిమానులు తెగ పోస్టులు పెడుతున్నారు.

కానీ మినిమం క్రూతో సినిమా స్టార్ట్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి సర్కారువారి పాట సెట్స్ పైకి రావడానికి ఇంకాస్త టైమ్ పట్టేలా ఉంది.