Mahesh Babu Interview about ‘Sarkaru Vaari Paata’

Wednesday,May 11,2022 - 03:05 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన మూవీ  'సర్కారు వారి పాట'  మైత్రీ మూవీ మేకర్స్,  జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ చంద్ ఆచంట  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ సినిమా కోసం కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

పరశురాం అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దిన 'సర్కారు వారి పాట' మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా  సూపర్ స్టార్ మహేష్ బాబు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మహేష్ మాటల్లోనే ...

 

బలంగా నిలబడ్డారు

కరోనా కాలంలో అందరం కష్టకాలం ఎదుర్కున్నాం. లాక్ డౌన్ వలన షూటింగ్ పలుమార్లు ఆగింది. చిత్ర యూనిట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్,  నిర్మాతలు ఇంత కష్టకాలంలో బలంగా నిలబడ్డారు. వారికి థ్యాంక్స్ చెప్పాలి.

 

క్రెడిట్ పరశురాం గారికే

'సర్కారువారిపాట'క్రెడిట్ దర్శకుడు పరశురాం గారికి దక్కుతుంది. పాత్రని చాలా కొత్తగా డిజైన్ చేశారు. చాలా ఎంజాయ్ చేసి పని చేశాను. పోకిరి రోజులు గుర్తుకు వచ్చాయి. బాడీ లాంగ్వెజ్, డైలాగ్ డెలివరీ .. ఇలా ప్రతిది కొత్తగా వుంటుంది.

 

పోకిరి మీటర్ లో వుంటుంది

సర్కారు వారి పాటలో క్యారెక్టర్  పోకిరి మీటర్ లో వుంటుంది. పోకిరి షేడ్స్ లో వున్న క్యారెక్టర్ మళ్ళీ దొరికింది. పోకిరి చూస్తే థియేటర్ లో ఒక మాస్ ఫీలింగ్ వుంటుంది. అలాంటి క్యారెక్టర్ మళ్ళీ సర్కారు వారి పాటతో కుదిరింది.

 

మమ మహేష్ పాట ఒక హైలెట్

 మొదట ఒక సాంగ్ అనుకున్నాం. సినిమా ఫ్లో చూసినప్పుడు ఆ పాట సరిగ్గా కుదరలేదని దర్శకుడు పరశురాం భావించారు. ఒక మాస్ సాంగ్ ఐతే బావుంటుందని టీం మొత్తం నిర్ణయానికి వచ్చాం. తమన్  "మమా మహేష్.."  పాట ట్యూన్ వినిపించారు.  చాలా ఎనర్జీటిక్ గా అనిపించింది. పది రోజుల్లో  ఒక భారీ సెట్ వేసి షూట్ చేశాం. పాట అద్భుతంగా వచ్చింది. సర్కారు వారి పాటలో మమ మహేష్ పాట ఒక హైలెట్ గా ఉండబోతుంది.

 

మార్పులు చేయలేదు

ఎలాంటి మార్పులు చేయలేదు. మొదట ఏం అనుకున్నామో అదే చేశాం. ఇక వాయిదా అంటే మేమే కాదు కరోనా కారణంగా దాదాపు సినిమాలన్నీ ఆలస్యమౌతు వచ్చాయి. అన్ని సినిమాలు ఈ పరిస్థితి ఎదురుకున్నాయి.

 

లుక్ పై వర్క్ చేయడం మొదలుపెట్టాం

'భరత్అనేనేను'లో ఒక స్టిల్ తీసుకొని దాని  పై టాటూ  పెట్టి లుక్  ఇలా  వుంటుందని చూపించారు. అద్భుతంగా అనిపించింది. తర్వాత లుక్ పై వర్క్ చేయడం మొదలుపెట్టాం.

 

మరో ఆలోచన లేకుండా

పరశురాం గారి 'గీత గోవిందం'నాకు చాలా నచ్చింది.  పరశురాం సర్కారు వారి పాట  కథ చెప్పినపుడు చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. మరో ఆలోచన లేకుండా సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను.

 

చాలా రిఫ్రెషింగ్ గా వుంటుంది

''గత మూడు సినిమాల్లో మెసేజ్ బాగా రుద్దారు. మహేష్ బాబుని ఇలా బౌండరీలు లేకుండా చూడటం బావుంది''అని సర్కారు వారి పాట ట్రైలర్  ఫీడ్ బ్యాక్ వస్తుంది. సినిమా కూడా చాలా రిఫ్రెషింగ్ గా వుంటుంది.

 

నా దృష్టి తెలుగు సినిమాపైనే

తెలుగు సినిమా తీద్దామనే మొదలుపెట్టాం. దీనికి బాగా సమయం పట్టింది. నా దృష్టి తెలుగు సినిమాపైనే వుంది. తెలుగు సినిమానే బాలీవుడ్ కి రీచ్ కావాలని కోరుకుంటాను.

 

అందరికీ నచ్చే సినిమా

సినిమా అభిమానులతో పాటు అందరికీ నచ్చాలి. అందరికీ నచ్చే సినిమా చేయాలనే వుంటుంది. ఇంత భారీ బడ్జెట్ తో పూర్తిగా ప్రయోగాత్మక సినిమాలు కూడా చేయలేం. అందరూ మెచ్చే సినిమా చేసే దిశగానే కష్టపడుతుంటా.

 

కథ నుంచే టైటిల్

పరశురాం గారు మొదట టైటిల్ చెప్పలేదు.  కథ నుంచే టైటిల్ పుట్టింది. సర్కారు వారి పాట అని ఆయన చెప్పిన వెంటనే నాకు నచ్చేసింది. మరో ఆలోచన లేకుండా ఫిక్స్ చేయమని చెప్పాను.

 

చాలా సర్ ప్రైజింగా వుంటుంది

కీర్తి సురేష్ అలా చెప్పింది కానీ సినిమాలో ఇరగదీసింది. సర్కారు వారి పాటలో కీర్తి పాత్రచాలా సర్ ప్రైజింగా వుంటుంది. లవ్ ట్రాక్ మెయిన్ హైలెట్. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.

 

ఆ కిక్కే వేరు

సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది. మా కాంబినేషన్ అంటేనే డిఫరెంట్ లెవల్ వుంటుంది. ఆయన అద్భుతమైన రచయిత. ఆయన రాసిన డైలాగ్ నేను పలుకుతుంటే ఆ కిక్కే వేరు. ఆయన సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచుస్తున్నా.

 

నిర్మాతలతో వర్క్ చేయడం గొప్ప అనుభవం

నాకు బాగా తెలిసిన నిర్మాతలు. దూకుడు, శ్రీమంతుడు  లాంటి బ్లాక్ బస్టర్స్  సినిమాలు మా కాంబినేషన్ లో వున్నాయి. సర్కారు వారి పాట కి లాక్ డౌన్ కారణంగా చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఎక్కడా రాజీ పడకుండా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. అలాంటి నిర్మాతలతో వర్క్ చేయడం గొప్ప అనుభవం.

 

కొత్త ఎక్స్ పిరియన్స్

సర్కారు వారి పాట కొత్త ఎక్స్ పిరియన్స్.  ఆరు నెలల్లో సినిమా అయిపోతుంది. కానీ ఈ సినిమా జర్నీ రెండేళ్ళు సాగింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎక్కడ ఆపమో అక్కడి నుంచి అదే ఎనర్జీతో మొదలుపెట్టడం అంత తేలిక కాదు. ఈ విషయంలో దర్శకుడు పరశురాం, టీమ్  ని మెచ్చుకోవాలి. ఎనర్జీని హోల్డ్ చేసి పట్టుకున్నారు.

 

రీరికార్డింగ్ కూడా అదరగొట్టాడు

తమన్ మ్యూజికల్ సెన్సేషన్. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.. కళావతి పాట నా కెరీర్ లోనే బెస్ట్ సాంగ్ గా నిలిచింది. ట్యూన్ ఇచ్చినపుడు ఈ పాట ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. ఐతే తమన్ బలంగా నమ్మాడు. ప్రతి పెళ్లిలో ఇదే పాట వినిపిస్తుందని చెప్పాడు. అదే జరిగింది. మిగాత పాటలు అద్భుతంగా వచ్చాయి. రీరికార్డింగ్ కూడా అదరగొట్టాడు.

 

మళ్ళీ మళ్ళీ చూస్తారు

దూకుడు సినిమాకి రిపీట్ ఆడియన్స్ వచ్చారు. ఫారిన్ లో వున్న లవ్ ట్రాక్ రిపీట్ ఆడియన్స్ రావడానికి మెయిన్ రీజన్. ఆ ట్రాక్ చాలా ఎంజాయ్ చేశారు. సర్కారు వారి పాట లో కూడా లాంటి అద్భుతమైన ట్రాక్ కుదిరింది. ఖచ్చితంగా ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూస్తారు.

 

వాళ్ళ ఇష్టాలని గౌరవిస్తాను

పిల్లలపై ఎలాంటి వత్తిడి లేదు. సితార పాప తనకి నచ్చింది చేస్తుంది. గౌతమ్ కి చదువుకోవడం ఇష్టం. వాళ్ళ ఇష్టాలని గౌరవిస్తాను.

 

ఆయనతో మంచి ఎక్స్ పిరియన్స్

ఈ పాత్రకి సముద్రఖని గారైతే బావుంటుందని పరశురాం గారికి చెప్పాను. ఆ పాత్ర కు చాలా ఫ్రెష్ నెస్ తీసుకొచ్చారు. ఈ సినిమాలో నేను చాలా కళ్ళ జోళ్ళు వాడను. గుర్తుగా వుంటుంది ఒక కళ్ళ జోడు ఇవ్వమని అడిగారు. ఆయనతో వర్క్ చేయడం మంచి ఎక్స్ పిరియన్స్.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics