Mahesh appreciates Sridevi Soda Center Movie

Saturday,August 28,2021 - 01:35 by Z_CLU

తమిళ, మలయాళ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అత్యంత సహజంగా, ఒరిజినల్ గా తెరకెక్కింది శ్రీదేవి సోడా సెంటర్. సెకెండ్ వేవ్ తర్వాత హయ్యస్ట్ థియేటర్లలో రిలీజైన సినిమాగా రికార్డు సృష్టించిన ఈ మూవీ.. మొదటి రోజే మంచి టాక్ సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ కు ఆడియన్స్ అంతా షాక్ అవుతున్నారు. యూనిట్ ను ప్రత్యేకంగా మెచ్చుకుంటూ ట్వీట్స్ పెడుతున్నారు.

ఇప్పుడీ లిస్ట్ లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరిపోయాడు. శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన మహేష్ బాబు.. ఈ సినిమాను మెచ్చుకున్నాడు. సినిమాలో హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ తనకు బాగా నచ్చిందన్న మహేష్.. పలాస తర్వాత దర్శకుడు కరుణకుమార్ మరో బోల్డ్ ఎటెంప్ట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడని మెచ్చుకున్నాడు.

ఇక హీరో, తన బంధువు సుధీర్ బాబును ప్రత్యేకంగా అప్రీషియేట్ చేశాడు మహేష్. సినిమాలో సుధీర్ బాబు యాక్టింగ్ బాగుందన్న సూపర్ స్టార్.. అతడి కెరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను చెప్పుకొచ్చాడు.

సుధీర్ బాబుతో పాటు నరేష్, హీరోయిన్ ఆనంది మంచి పాత్రలు పోషించారని, వాళ్ల పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచిందన్న మహేష్.. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీని ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. యూనిట్ అందరికీ కంగ్రాట్స్ చెప్పాడు.

సుధీర్ బాబు, ఆనంది హీరోహీరోయిన్లుగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజైంది. దాదాపు 530 థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు అన్ని సెంటర్ల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో సుధీర్ బాబు, ఆనంది, నరేష్ పెర్ఫార్మెన్స్ ను అంతా మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో, ఇకపై మరిన్ని ఈ తరహా మాస్ పాత్రల్ని పోషించబోతున్నాడు సుధీర్ బాబు.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics