Mahesh about Sarkaru Vaari Paata and Movie with Rajamouli

Monday,September 27,2021 - 01:25 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్-పరశురాం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' సినిమా ఎంత వరకూ వచ్చింది ? అసలు సినిమా షూటింగ్ ఎంత పర్సెంట్ ఫినిష్ అయింది ? ఇవి ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ మైండ్ లో ఉన్న క్వశ్చన్స్. ఈ ప్రశ్నలకు మహేష్ తన మాటలతో క్లారిటీ ఇచ్చేశాడు. ఇటివలే ఓ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేశాడు మహేష్. ఆ ఈవెంట్ లోనే మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చి అభిమానులను ఖుషి చేశాడు.

Mahesh sarkaru vaari paata movie stills

సర్కారు వారి పాట గురించి మహేష్ చెప్తూ " జనవరిలో షూటింగ్ మొదలు పెట్టాం. ఇప్పటి వరకు అరవై నుండి 70 శాతం వరకు షూట్ ఫినిష్ చేశాం. ఆ సినిమా గురించి నేను ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నాను. ఆ సినిమాలో నా ఫ్యాన్స్ , సినిమా ఆడియన్స్ కొత్త మహేష్ ని చూస్తారు. సింగిల్ సిట్టింగ్ లో ఒకే చేసిన స్క్రిప్ట్ అది. కచ్చితంగా అందరినీ అలరించేలా ఉంటాయి. ఎవరూ రషెస్ చూసినా పోకిరి కి ఏమాత్రం తగ్గదు అంటూ సేమ్ వైబ్స్ తో చెప్తున్నారు. " అంటూ చెప్పిన మహేష్ త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాను ఈ ఏడాదే మొదలు పెట్టనున్నట్లు తెలిపాడు.

Mahesh sarkaru vaari paata movie stills

ఇక ఇదే ఈవెంట్ లో రాజమౌళితో మీ సినిమా ఎప్పుడు ఉండబోతుంది ? అనే ప్రశ్న కూడా మరోసారి మహేష్ కి ఎదురైంది. దానికి కూడా మహేష్ సమాధానమిచ్చి అప్డేట్ అందించాడు. " అందరికీ తెలిసిందే మేము కలిసి వర్క్ చేయబోతున్నామని. ఆ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. త్వరలోనే డీటెయిల్స్ బయటికి రానున్నాయి. ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ నాకు డ్రీం కం ట్రూ" అంటూ చెప్పుకున్నాడు మహేష్. ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ మూవీ అప్డేట్స్ అందించాడు సూపర్ స్టార్.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics