Maha Samudram Movie updates

Sunday,February 14,2021 - 11:50 by Z_CLU

శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న 'మ‌హాస‌ముద్రం' ఆగ‌స్ట్ 19న విడుద‌ల కానున్న‌ది. అదితి రావ్ హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ మూవీని ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన‌ప్ప‌ట్నుంచీ ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లోనూ, ప్రేక్ష‌కుల్లోనూ అమితాస‌క్తి వ్య‌క్త‌మ‌వుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం 'మ‌హాస‌ముద్రం' షూటింగ్ వైజాగ్‌లో జ‌రుగుతోంది. ఇంటెన్స్ ల‌వ్ యాక్ష‌న్ డ్రామాగా ఇది రూపొందుతోంది.

ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రాఫ‌ర్‌గా, చైత‌న్ భ‌రద్వాజ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా, ప్ర‌వీణ్ కె.ఎల్‌. ఎడిట‌ర్‌గా, కొల్లా అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.