Macherla Niyojakavargam stands as Nithin’s Career Best Opener

Sunday,August 14,2022 - 01:10 by Z_CLU

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ 'మాచర్ల నియోజకవర్గం' భారీ మాస్ కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మాతలుగా, ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కృతి శెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు నితిన్. చాన్నాళ్ల తర్వాత ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ చేసిన ఈ హీరో, ప్రేక్షకులకు థాంక్స్ చెప్పాడు. సినిమాలో కలెక్టర్ పాత్రలో కనిపించాడు నితిన్.

ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు చాలా పెద్ద థాంక్స్. నా కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చారు. మీ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని నమ్మాను, నా నమ్మకం 'మాచర్ల నియోజకవర్గం'తో మరోసారి నిజమైంది. చాలా కాలం తర్వాత నా జోనర్ ని మార్చి యాక్షన్ లోకి వెళ్లాను. దీన్ని ప్రేక్షకులు అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. సినిమాని ఆడియన్స్ తో థియేటర్లో చూశాను. యాక్షన్, కామెడీ సీన్స్ కి మీరు ఇచ్చే చప్పట్లు విజల్స్ మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయి. సినిమా రెవెన్యు చాలా బావుంది. రెండో రోజు కూడా చాలా బలంగా వుందని చెబుతున్నారు. వెన్నెల కిషోర్ కామెడీ, యాక్షన్ సీన్స్, నా లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. కృతి శెట్టి, డీవోపీ ప్రసాద్ మురెళ్ళ, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ ,, అందరూ ది బెస్ట్ వర్క్ ఇచ్చారు. సాగర్ ఇచ్చిన పాటలు , నేపధ్యం సంగీతం సినిమాలో అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇంత మంచి ఓపెనింగ్ ఇవ్వడం చాలా ఆనందంగా వుంది. ఇలాగే కష్టపడుతూ ఇంకా మంచి సినిమాలు తీస్తాను. సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు'' తెలిపారు.