‘Maa Neella Tank’ Promos are very intresting

Thursday,July 07,2022 - 02:54 by Z_CLU

'Maa Neella Tank' Promos are very intresting

తెలుగు ప్రేక్షకులకు బెస్ట్ వెబ్ సిరీస్ లు అందిస్తోన్న ZEE5 సంస్థ నుండి మరో ఎంటర్టైనింగ్ సిరీస్ రాబోతుంది. లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో 'మా నీళ్ళ ట్యాంక్' అనే టైటిల్ తో ఫన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ కి సంబంధించి ఇటివలే టీజర్ రిలీజైంది. ఎనిమిది ఎపిసోడ్స్ తో మంచి ఎంటర్టైనింగ్ సిరీస్ గా తెరకెక్కిన మా నీళ్ళ ట్యాంక్ టీజర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. తాజాగా సిరీస్ లో హీరో హీరోయిన్ కేరెక్టర్ ఇంట్రడ్యూస్ ప్రోమోస్ రిలీజ్ చేశారు.

సుశాంత్ ఇందులో వంశీ అనే పోలీస్ కేరెక్టర్ ప్లే చేస్తున్నాడు. దానికి సంబంధించి హీరో నాని వంశీ కేరెక్టర్ ప్రోమోని ఇటివలే రిలీజ్ చేశారు. అలాగే సిరీస్ లో హీరోయిన్ గా కనిపించనున్న ప్రియా ఆనంద్ కేరెక్టర్ సురేఖ కి సంబంధించి కూడా ఓ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ రెండు ప్రోమోస్ సిరీస్ పై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగిస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

ప్రవీణ్ కొల్ల నిర్మించిన ఈ సిరీస్ కి రాజ్ శ్రీ బిశ్ట్ , సురేష్ మైసోర్ అందించారు. కిట్టు విస్సాప్రగడ మాటలు రాసాడు. 'వరుడు కావలెను' ఫేమ్ లక్ష్మి సౌజన్య డైరెక్ట్ చేస్తున్న ఈ సిరీస్ జులై 15న జీ5 స్ట్రీమింగ్ అవ్వనుంది.

*Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics