Love Story postponed again
Friday,April 09,2021 - 11:03 by Z_CLU
లవ్ స్టోరీ సినిమా ఇప్పటిది కాదు. 2019 నుంచి ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. మధ్యలో కరోనా/లాక్ డౌన్ రావడంతో మరో ఏడాది ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈ సమ్మర్ కు సినిమా వస్తుందనుకుంటే ఇంకోసారి పోస్ట్ పోన్ అయింది.
నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కింది లవ్ స్టోరీ సినిమా. మూవీకి సంబంధించి ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు. సారంగ దరియా అనే పాట అయితే యూట్యూబ్ లో పెద్ద హిట్ కూడా అయింది. ఈనెల 16న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు కూడా. థియేటర్ లిస్ట్ కూడా రెడీ అయిన తర్వాత లవ్ స్టోరీ సినిమా వాయిదాపడింది.
ఇప్పటికే సెకెండ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది. ఫ్యామిలీస్ థియేటర్లకు రావడం లేదు. ఇలాంటి టైమ్ లో లవ్ స్టోరీ సినిమాను రిలీజ్ చేస్తే, చేజేతులా సినిమాను కిల్ చేసినట్టవుతుందనేది నిర్మాతల ఫీలింగ్. ఓవైపు వకీల్ సాబ్ లాంటి సినిమా భారీ ఓపెనింగ్స్ తో ఊరిస్తున్నప్పటికీ.. మూవీ జానర్, హీరో-హీరోయిన్ల ఇమేజ్, మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని వాయిదా వేయడమే బెటరని ఫిక్స్ అయ్యారు.
ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా ఇది. పాటలు హిట్టవ్వడంతో పాటు చైతూ-సాయిపల్లవి పెయిర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పవన్ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.
రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మాతలు. త్వరలోనే మరో రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నారు.
- - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics