Leharaayi Song from Most Eligible Bachelor released

Wednesday,September 15,2021 - 04:08 by Z_CLU

అఖిల్ అక్కినేని , పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా నుండి లెహరాయి అనే సాంగ్ విడుదల చేశారు. ప్రోమోతోనే ఎట్రాక్ట్ చేసిన ఈ సాంగ్ నేటి నుండి ఫుల్ సాంగ్ గా యూట్యుబ్ లో అందుబాటులో ఉండనుంది. గోపిసుందర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ప్రెజెంట్ మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటూ మంచి వ్యూస్ తో దూసుకెళ్తుంది. ఈరోజు ఉదయం రిలీజైన ఈ రొమాంటిక్ సాంగ్ విజువల్ గా కూడా ఎట్రాక్ట్ చేస్తుంది. లిరికల్ వీడియోలో అఖిల్ , పూజ రొమాంటిక్ విజువల్స్ సాంగ్ కి మరింతం అందం తీసుకొచ్చాయి.

ఈ సాంగ్ లో పూజా అందాల ఆరబోత కుర్రకారు మతి పోగొట్టడం ఖయమనిపిస్తుంది. గోపిసుందర్ ట్యూన్ కి శ్రీమణి అందించిన లిరిక్స్ కూడా హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా "గుండె వెచ్చనయ్యి ఊహలేగిరాయి" , "గోరు వెచ్చనైన ఊసులదిరాయి" లాంటి లైన్స్ బాగున్నాయి. ఇక లేటెస్ట్ సింగింగ్ సెన్సేషనల్ సిద్ శ్రీరామ్ ఈ సాంగ్ ని పాడటంతో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

గీతా ఆర్ట్స్ 2 బేనర్ పై బన్నీ వాస్ , వాసు వర్మ నిర్మిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 8న థియేటర్స్ లోకి రానుంది. ఈ సాంగ్ తో ప్రమోషన్ మొదలు పెట్టి ఇక నుండి సినిమాపై బజ్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే టీజర్ తో పాటు విడుదలైన పాటలన్నీ సినిమాపై మంచి ఇంప్రెషన్ తీసుకొచ్చాయి. త్వరలోనే మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics