Legendary actor Sai Kumar about ‘Gaali Vaana’ Series

Monday,April 11,2022 - 12:06 by Z_CLU

ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తమ నటనతో మెప్పించిన లెజెండరీ యాక్టర్స్ రాధికా , సాయి కుమార్ ఇద్దరూ కలిసి ఫైనల్ గా ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన 'గాలి వాన' వెబ్ సిరీస్ ZEE5 లో ఏప్రిల్ 14 న స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఇప్పటికే ట్రైలర్ , ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సిరీస్ గురించి నటుడు సాయి కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూ మాట్లాడారు.

'గాలి వాన' గురించి సాయి కుమార్ మాట్లాడుతూ "రాధిక గారు నేను ఎప్పటి నుండో ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నాం. మా కాంబోలో రెండు మూడు సినిమాలు కూడా అనుకున్నాం. 'కలికాలం' తమిళ్ లో చేసినప్పుడు అందులో కూడా నటించాలని నేను ఎంతో ట్రై చేశాను. అందులో మదర్ రోల్ చేసింది రాధిక గారే. కానీ నేను చేయలేకపోయాను. జయసుధ గారితో చేశాను,  లక్ష్మి గారితో చేశాను, కానీ రాధిక గారితో చేయలేకపోయాననే ఓ ఫీలింగ్ ఉండేది. ఐ థింక్ 'గాలి వాన' కోసమే భగవంతుడు మా కాంబోని ఇన్నాళ్ళు ఆపాడేమో అనిపిస్తుంది. ఎన్నో సార్లు మిస్ అయ్యాం, ఫైనల్ గా ఇలా ఇద్దరం కలిసి ఈ సిరీస్ లో నటించాం. ఇప్పుడు పోస్టర్ మీద ఇద్దరం ఇలా కనిపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. థాంక్స్ టూ 'గాలి వాన'. " అంటూ తమ కాంబో గురించి చెప్పుకున్నారు డైలాగ్ కింగ్ సాయి కుమార్.

ప్రేక్షకులతో పాటు వీరిద్దరూ కలిసి స్క్రీన్ పై కనిపించాలానే కోరిక ఫైనల్ గా 'గాలి వాన' సిరీస్ తో తీరనుంది. ఈ సిరీస్ తో ఈ కాంబో కచ్చితంగా ఆడియన్స్ మెస్మరైజ్ చేయడం ఖాయమనిపిస్తుంది. రాధికా శరత్ కుమార్ సరస్వతి పాత్రలో సాయి కుమార్ కొమర్రాజు అనే పాత్రలో నటిస్తున్న 'గాలి వాన' సిరీస్ కి శరణ కొప్పిశెట్టి దర్శకుడు. జీ5 సగర్వంగా అందిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది.

Dont Miss 'Gaali Vaana' on April 14th Only On Zee5 

 
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics