Latest Buzz: Pawan Kalyan ,Sujeeth film goes floors on December ?

Tuesday,November 29,2022 - 05:15 by Z_CLU

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎక్కువ డేట్స్ కేటాయించి త్వరగా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు పవన్.  ఈ భారీ ప్రాజెక్ట్ తర్వాత, పవర్ స్టార్ హరీష్ శంకర్ తో ఒక సినిమా సుజీత్ తో మరొక సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. సాహో తర్వాత సుజీత్ చాలా గ్యాప్ తీసుకున్నాడు ఇటివలే పవన్ కళ్యాణ్ ను కలిసి ఓ స్టోరీ వినిపించాడని టాక్.

పవన్ -సుజీత్ కాంబో 'తేరి' రీమేక్ కోసం కలవనున్నట్లు కూడా ఓ టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా ఈ కాంబో సినిమా మాత్రం పక్కా అని సమాచారం. డిసెంబర్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ కాంబో సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తాడని అంటున్నారు. మరి త్వరలోనే పవన్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో సినిమా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics