Kriti Sanon as Sita in Adipurush?

Saturday,November 28,2020 - 02:43 by Z_CLU

AdiPurush Heroine ఎవరనే టాపిక్ పై దాదాపు నెల రోజులుగా డిస్కషన్ నడుస్తూనే ఉంది. ఎట్టకేలకు ఈ సస్పెన్స్ వీడనుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆదిపురుష్ లో సీత పాత్రకు కృతి సనన్ (Kriti Sanon) దాదాపు ఫిక్స్ అయినట్టే.

ఈ సినిమాలో సీత పాత్ర కోసం ఇప్పటివరకు అనుష్క, కియరా అద్వానీ, కీర్తిసురేష్ పేర్లు తెరపైకి వచ్చాయి. తనకు ఆదిపురుష్ ప్రాజెక్టుతో సంబంధం లేదని అనుష్క ఆల్రెడీ ప్రకటించింది.

Also Check - ఆదిపురుష్ రిలీజ్ డేట్

ఎట్టకేలకు కృతి సనన్ ను ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్టులోకి తీసుకున్నారు. ఇంతకుముందు మహేష్ హీరోగా వచ్చిన 1-నేనొక్కడినే సినిమాలో నటించింది కృతి సనన్. ఆ తర్వాత దోచేయ్ సినిమా చేసింది.

Dohchay (దోచెయ్) Full Movie

దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాబోతోంది ఆదిపురుష్. సినిమాలో రాముడి పాత్రలో Prabhas, సీత పాత్రలో Kriti Sanon కనిపించబోతున్నారు. ఇక రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించనున్నాడు.

Kriti Sanon as Sita in Adipurush

ఓం రౌత్ దర్శకత్వంలో జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఈ మూవీ కోసం ప్రభాస్ వరుసగా 3 నెలల పాటు కాల్షీట్లు కేటాయించాడు. 2022, ఆగస్ట్ 11న AdiPurush Release అవుతుంది.