Krithi Shetty in Nani’s Shyam Singha Roy

Monday,October 05,2020 - 01:56 by Z_CLU

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతోంది హీరోయిన్ కృతి షెట్టి (Krithi Shetty). అయితే ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ బెంగళూరు బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఆల్రెడీ గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై ఓ సినిమాకు కమిట్ అయిన ఈ చిన్నది, ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుంది. ఏకంగా నాని సరసన నటించబోతోంది. త్వరలోనే రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ (shyam singha roy) అనే సినిమా చేయబోతున్నాడు నాని. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సాయిపల్లవిని తీసుకున్నారు. ఇందులో సెకెండ్ హీరోయిన్ పాత్ర కోసం కృతి షెట్టిని అప్రోచ్ అయింది నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్. పేరుకు ఇది సెకెండ్ హీరోయిన్ రోల్ అయినప్పటికీ.. కృతి షెట్టి రోల్ కు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉందట. ఈ సినిమాతో Nani-Krithi కలవడం ఆల్ మోస్ట్ ఫిక్స్ అంటున్నారు.