Krithi Sanon fixed as Sita in ‘Adipurush’?

Friday,February 26,2021 - 06:27 by Z_CLU

ప్రభాస్ రాముడిగా సైఫ్ అలి ఖాన్ రావణుడిగా నటించనున్న'ఆదిపురుష్' సినిమాలో సీత పాత్రకు ఇంకా హీరోయిన్ ఫైనల్ అవ్వలేదన్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం సినిమాలో సీత పాత్రకు కొందరు హీరోయిన్స్ ఫైనల్ చేశారట మేకర్స్. ఆ లిస్టు నుండి తాజాగా కృతి సనన్ ని సెలెక్ట్ చేశారని సమాచారం.

మహేష్ బాబు '1' సినిమాతో టాలీవుడ్ కి  హీరోయిన్ గా పరిచయమైంది కృతి. ఆ తర్వాత నాగ చైతన్యతో 'దోచేయ్' చేసింది. ఆ రెండు సినిమాలతో  టాలీవుడ్ ఆడియన్స్ కి సుపరిచితురాలైన ఈ బాలీవుడ్ బ్యూటీతో సీత పాత్ర చేయిస్తే బాగుంటుందని మేకర్స్ అభిప్రాయ పడ్డారని తెలుస్తుంది.

టీ-సిరీస్ మూవీస్ బేనర్ పై పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటివలే మొదలైంది. త్వరలోనే ఈ షూట్ లో ప్రభాస్ తో పాల్గొననున్నాడు.