Kothi Kommachi Shooting Started

Tuesday,November 03,2020 - 06:09 by Z_CLU

'శతమానం భవతి'తో జాతీయ అవార్డు అందుకున్న వేగేశ్న సతీష్ దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్న హీరోలుగా తెరకెక్కుతున్న 'కోతి కొమ్మచ్చి' షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం అమలాపురంలో హీరో హీరోయిన్స్ పై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. రెండు వారాల తర్వాత యూనిట్ వైజాగ్ కి షిఫ్ట్ అవ్వనుంది. అక్కడ మరికొన్ని సన్నివేశాలు షూట్ చేయనున్నారు.

లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎల్.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

రిద్ది కుమార్ , మేఘ చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. డిసెంబర్ లో షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.