Khiladi Movie Day-1 Collections

Saturday,February 12,2022 - 06:11 by Z_CLU

హీరో రవితేజ నటించిన తాజా చిత్రం ఖిలాడీ. వరల్డ్ వైడ్ నిన్న గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమాకు తొలి రోజు డీసెంట్ గా వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు 4 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఆంధ్రాలో సెకెండ్ షో లేనప్పటికీ.. పూర్తిస్థాయిలో ఆక్యుపెన్సీ లేనప్పటికీ ఈ సినిమాకు మొదటి రోజు కోటి 88 లక్షల రూపాయల షేర్ రావడం చెప్పుకోదగ్గ విశేషమే. ఇక నైజాంలో ఫుల్ ఆక్యెపెన్సీ ఉన్నప్పటికీ, టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కూడా ఉన్నప్పటికీ దాదాపు ఏపీలో వచ్చిన షేరే వచ్చింది. సీడెడ్ లో ఈ సినిమాకు 56 లక్షలు వచ్చాయి.

నిన్న రిలీజైన ఈ సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా ఏ రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 24 కోట్ల రూపాయలకు అమ్మారు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 25 కోట్లు (హయ్యర్స్ తో కలిపి) కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

ఏపీ, నైజాం ఫస్ట్ డే కలెక్షన్ నైజాం - రూ. 1.86 కోట్లు సీడెడ్ -56 లక్షలు ఉత్తరాంధ్ర - 46 లక్షలు ఈస్ట్ - 26 లక్షలు వెస్ట్ - 21 లక్షలు గుంటూరు - 56 లక్షలు నెల్లూరు - 21 లక్షలు కృష్ణా - 18 లక్షలు