Keerthy Suresh new movie Titled as Aina Ishtam Nuvvu

Thursday,September 17,2020 - 01:47 by Z_CLU

సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రానికి ''ఐనా ఇష్టం నువ్వు'' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్ రౌతు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నట్టి కరుణ, నట్టి క్రాంతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ దేవ్ విలన్ గా నటిస్తోన్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. కేవలం మూడు రోజుల షూటింగ్ బ్యాలన్స్ మాత్రమే ఉంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా అక్టోబర్ చివరి వారంలో విడుదల కానుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఒక అందమైన ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కింది.